తెలుగు ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివివినాయక్ దర్శకత్వంలో సినిమా ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తాడు.  దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది డైరెక్టర్లను సంప్రదించినప్పటికీ.. తనకు ఠాగూర్ లాంటి సూపర్ హిట్ అందించిన వివివినాయక్ నే ఎంచుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి అల్ టైమ్ రికార్డ్ సినిమా అందించాడు..వినాయక్.  
Image result for khaidi no 150
తెలుగు ఇండస్ట్రీలో వంద కోట్లు దాటడమే గగనం అనుకునే పరిస్థితిలో మెగాస్టార్ సినిమా ఏకంగా 150 కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది.  అలాంటి వివివినాయక్ తో మంచు మనోజ్ సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి.  దీనిపై స్పందించిన వినాయక్ అబ్బే అవన్నీ వొట్టి పుకార్లని అలాంటి నమ్మవద్దని అంటున్నారు.  అంతే కాదు ఈ వార్తలు చదివి తాను కూడా షాక్ కి గురయ్యానని అన్నారు.
Image result for manchu manoj
మంచు మనోజ్ తో నేను సినిమా చేయడం లేదని ,అలా వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవే అని అంటున్నాడు వినాయక్.  అసలు ఈ వార్తలు ఎలా వచ్చాయని ఆవేదన చెందుతున్నాడట వినాయక్. ఇటీవలే చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  తన తర్వాత చిత్రం కూడా మరో బ్లాక్ బ్లస్టర్ కావాలన్న ఆలోచనలో ఉన్న ఈ మాస్ డైరెక్టర్ ఏ హీరోతో తీస్తారో ఇంకా వివరాలు చెప్పలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: