ఖైది నంబర్ 150తో మెగాస్టార్ రీ ఎంట్రా ఊహించిన దాని కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించడమే కాదు మెగాస్టార్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచి 100 కోట్ల కలక్షన్స్ ను సైతం కొట్టగొట్టింది. ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ఉత్సాహం ఉంటుందని తెలిస్తే రీమేక్ కాకుండా స్ట్రైట్ సినిమా తీసేవాడని మెగా కాంపౌండ్ మధ్య చిరు అన్న టాక్ కూడా తెలిసిందే.


ఇక అతి తర్వాత చేయనున్న 151వ సినిమాను ఖైది కన్నా అదిరిపోయే రేంజ్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో వస్తున్న చిరు సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉండాలి అన్న దాని మీద వేల కొద్ది స్కెచ్ లు వేయించారట.


ఫైనల్ గా చిరు లుక్ ఓకే చేశారట.. ఇప్పుడు ఆ లుక్ సొషల్ మీడియాలోకి లీక్ చేశారు. అఫిషియల్ గా కాదుకాని లీక్ అయిన చిరు ఉయ్యాలవాడ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. చిరు లుక్ స్కెచ్ ఫాంలో ఉన్నా అదరగొట్టింది. ఓ రకంగా చిరుని ఇలా గెటప్ లో చూస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. 


ఇక ఇక్కడ ఫ్యాన్స్ ఆలోచిస్తున్న మరో విషయం ఏంటి అంటే మెగాస్టర్ డిఫరెంట్ గెటప్ ప్రయత్నించిన ప్రతిసారి ఫెల్యూర్ ఎదుర్కున్నాడు. ఆ సెంటిమెంట్ పరంగా చూస్తే ఫ్యాన్స్ కాస్త ఆలోచనలో పడ్డారు. చిరు ప్రీ లుక్ హంగామా చేస్తున్నా సినిమా వచ్చి హిట్ కొడితే కాని నమ్మకం కుదరదు. 170 ఏళ్ల క్రితం జరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను సినిమాగా తీస్తున్న టైటిల్ కూడా ఉయ్యాలవాడ నరసిం హారెడ్డి అని పెడుతున్నారని టాక్.  



మరింత సమాచారం తెలుసుకోండి: