ఆగడు, బ్రూస్ లీ ఫ్లాపుల తర్వాత డైరక్టర్ శ్రీనువైట్ల మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమా మిస్టర్. లావణ్య త్రిపాఠి, హెబ్భా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.


మిస్టర్ ఓ లవ్ స్టోరీ.. అంతేకాదు ఓ మాస్ మసాల స్టోరీ.. ఎంటర్టైనింగ్ స్టోరీ కూడా. సినిమాలో ఉన్న అన్ని యాంగిల్స్ ను ట్రైలర్ లో చూపించి ఇంప్రెస్ చేశాడు శ్రీనువైట్ల. రాధా మోహన్, శ్రీధర్ శీపాన రచనా సహకారంలో వస్తున్న ఈ మిస్టర్ ట్రైలర్ ఓకే అనిపించేలా ఉన్నా శ్రీనువైట్ల రొటీన్ ఫార్ములా మాత్రం వదలలేదు అనిపిస్తుంది.


కంచె, లోఫర్ సినిమాల తర్వాత మెగా హీరో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ మిస్టర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. హెబ్భా అందాలు.. లావణ్య క్యూట్ నెస్ సినిమాకు ప్లస్ అవుతాయని అనిపిస్తుంది. ట్రైలర్ అయితే కలర్ఫుల్ గా ఉంది మరి సినిమా ఏం చేస్తాడో చూడాలి.


స్టార్ డైరక్టర్ గా మంచి ఫాంలో ఉన్నప్పుడు స్టార్ హీరోలతో ఫ్లాప్ సినిమాలను తీసిన శ్రీనువైట్ల ఇప్పుడు మళ్లీ తన సొంత టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు. మిస్టర్ రిజల్ట్ ను బట్టే తన తర్వాత సినిమాల అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: