Related image


నందమూరి తారక రామారావు తన నటనతో విజయ విహారం చేసిన వెండితెర అద్భుతం కంచుకోట. ఇది జానపద చిత్రాలకే కిరీటం లాంటిది. ఎన్.టి.ఆర్. కాంతారావులు కథానాయకులు. సావిత్రి, దేవిక కథానాయికలు 1967 మార్చి 22 న విడుదలైన ఈ సినిమా నిన్నటికి స్వర్ణోత్సవం జరుపుకుంది. ఈ ఐదు దశాబ్ధాల్లో దీనికి ముందు కాలము లో కూడా ఏ సినిమాకు లేని రెండు విషయాల్లో ప్రఖ్యాతి ఈ సినిమాకుంది.   


Image result for kanchukota movie NTR Devika Savitri hd images


అవేమంటే:

1. పెట్టిన పెట్టుబడి అన్నీ ఖర్చులతో కలిపి "ఒక వారం రన్" లోనే  కలక్షణ్ల రూపంలో రాబట్టుకుంది.   

2. రెండో సారి విడుదలై అంటే  "రిపీట్ రన్"  లో రోజూ మూడు ఆటలతో హైదరాబాద్ శోభనా థియేటర్ లో 100 రోజుల పండగ 1975 దిసెంబర్ 5 న అతిరధ మహారధుల సమక్షములో శోబాయమానంగా  జరుపుకుంది. బహుశ ప్రపంచ చరిత్రలోనే ఏ జానపద చిత్రానికి ఈ అదృష్టం పట్టలేదని తెలుస్తుంది.


Image result for kanchukota movie NTR kantha rao Devika Savitri hd images


"రిపీట్ రన్ -శతదినోత్సవం" ఇప్పటి సినిమాలకు సాధ్యమా?  రెగ్యులర్ రన్ లోనే 100 రోజులు ఆడని నేటి సినిమాలకు "రిపీట్-రన్" అనె మాటే లేదు. విజయవాడ  జైహింద్ టాకీస్ లో ప్రతీ సంవత్సరం విడుదలై నడిచే సినిమాల్లో  ‘కంచుకోట’ ఒకటి.


నందమూరి తారక రామారావు కు  వియ్యంకుడు అయిన యు.విశ్వేశ్వరరావు విశ్వశాంతి పిక్చర్స్‌ పతాకం పై నిర్మించిన ఈ  సినిమా  ‘కంచుకోట” నిన్నటికి   50 ఏళ్లు పూర్తిచేసుకుంది . ఈ చిత్రానికి సి.ఎస్.రావు దర్శకత్వం వహించారు. త్రిపురనేని మహారథి రాసిన కథ, స్ర్కీన్‌ప్లే మాటలు  ఆకట్టుకుంటాయి. జానపద చిత్రాల్లో సస్పెన్స్ అరుదు. కాని దీనిలో సస్పెన్స్ అద్భుతం.  సస్పెన్స్ థ్రిల్లర్‌ గా రూపొందిన  తొలి జానపద చిత్రం కంచుకోట. జానపదాల్లోనూ సస్పెన్సు తో అద్భుత అఖండ విజయం చూసిన సినిమా ఇది.


Image result for kanchukota movie NTR Devika Savitri hd images


ఈ సినిమాతో సినిమా రంగంలో బిజినెస్ ను కొత్తపుంతలు తొక్కించారు నిర్మాత.   ఈ చిత్రాన్ని ఏరియాలవారిగా రైట్స్‌ అమ్మి అప్పట్లో సంచలనం సృష్టించారు నిర్మాత విశ్వేశ్వరరావు. 1967 మార్చి 22 న విడుదలైన ఈ సినిమా “ఓ ట్రెండ్‌సెట్టర్‌” గా చెప్పవచ్చు .  అనాడే  నిర్మాణ వ్యయం ఏడు లక్షలు.  మొదటివారమే ఏడు లక్షలు వసూలు చేసి అప్పట్లో సంచలనమే సృష్టించింది కంచుకోట.  


నాటి మేటి జానపద కధానాయకులు, నాయికలు అద్భుత తారాతోరణం ఈ సినిమాకే తలమానికం. ‘కంచుకోట’ లో ఎన్టీఆర్‌, కాంతారావు, ఉదయ్‌కుమార్‌, సావిత్రి, దేవిక, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి, పద్మనాభం, వాణిశ్రీ, రమణారెడ్డి, చిత్తూరు నాగయ్య తదితరులు  నటించారు.


Related image


ఈ మ్యూజికల్‌  బ్లాక్బస్టర్ కు  కేవీ మహదేవన్ సంగీతం,  ఆత్రేయ, దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, మహారథి పాటలు రాశారు.  ‘కంచుకోట చిత్రం తొలిసా రే కాదు,  విడుదలైన ప్రతిసారి   సంచలన విజయం సాధించి, వసూళ్లలో  సరికొత్త రికార్డులు సృష్టించింది.

 

అనెక జానపద సినిమాలు కంచుకోట అనుసరించి తీసినవేవీ అంతగా విజయం సాధించినట్లు తెలియరాలేదు. ఈ సినిమాకే జానపద చిత్రాలు సరిరా వు. ఇందులో ఒక పాట  ‘సరిలేరు నీకెవ్వరూ, సరసాన సుధాకర ...’ యాదృచ్చికంగా ఈ సినిమా గొప్పదనానికి కూడా సూటవుతూ ఉంటుంది.  దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్‌  జానపద చిత్రాల్లో ఒక గొప్ప సినిమాగా  నిలిచింది ‘కంచుకోట’


Image result for kanchukota movie NTR savitri

మరింత సమాచారం తెలుసుకోండి: