నిన్న అర్దరాత్రి అందరికంటే ముందుగా ‘కాటమరాయుడు’ ను చూద్దాం అని ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ అభిమానుల ఆశలు నిరాశగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్ లోని కూకుట్ పల్లి భ్రమరాంబ-మల్లిఖార్జున ధియేటర్ కాంప్లెక్స్.. అలాగే యర్రగడ్డ శ్రీరాములు ధియేటర్లో ఎప్పుడూ వేసే విధంగా ‘కాటమరాయుడు’ బెనిఫిట్ షోలు వేద్దామని చేసిన పోలీస్ పర్మిషన్ లేదంటూ బెనిఫిట్ షోలను క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో నిజాంపేట క్రాస్ రోడ్ దగ్గర్లోని భ్రమరాంభ ధియేటర్ దగ్గర పవన్  ఫ్యాన్స్ తమ అసహనాన్ని వ్యక్తపరుస్తూ కొంత సేపు హడావిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు తదితర చిన్నచిన్న పట్టణాలలో నిన్న రాత్రి 12 గంటలకు ‘కాటమరాయుడు’ బెనిఫిట్ షో వేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

పశ్చిమ గిదావరి జిల్లాలోని చాల చోట్ల అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని ప్రముఖ పట్టణాలలో నిన్న రాత్రి ‘కాటమరాయుడు’ స్పెషల్ షోలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. గోదావరి జిల్లాలకు సంబంధించిన చాలామంది ప్రముఖులు ‘కాటమరాయుడు’ స్పెషల్ షోలను నిన్న రాత్రి చూసినట్లు వార్తలు వస్తున్నాయి. 

దాదాపు 2500 రూపాయల నుండి 3000 రూపాయల వరకు ఈ స్పెషల్ బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా దాదాపు మూడు లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్న సినిమా క్రిటిక్ కమైర్ ఖాన్ పవన్ పై ఘాటైన కామెంట్స్ పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. 

దీనికితోడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను కొనుక్కుని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు కొందరు పవన్ తీవ్రంగా విమర్శిస్తూ చేసిన ట్విట్ కూడ పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీనికితోడు పవన్ యాంటీ ఫ్యాన్స్ ఆయన పెళ్లిళ్లు తదితర వ్యవహారాలను ప్రస్తావిస్తూ చేస్తున్న ఘాటైన విమర్శల మధ్య నేడు విడుదల అవుతున్న ‘కాటమరాయుడు’ రిజల్ట్ పై అన్ని వర్గాలలోను ఆసక్తి విపరీతంగా ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: