1000 కోట్ల కలక్షన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని వచ్చేనెల విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ అంచనాలకు ఒక ఊహించని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులక్రితం కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని మల్టీ ప్లెక్స్ ధియేటర్ల టిక్కెట్స్ రేటు విషయంలో తీసుకున్న నిర్ణయం ‘బాహుబలి 2’ కు శాపంగా మారబోతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు కర్ణాటక రాష్ట్రంలోని మల్టీ ప్లెక్స్ ధియేటర్స్ ఏవీ కూడ 200 రూపాయలకు మించి టిక్కెట్ ధరను నిర్ణయించ కూడదని కర్ణాటక ప్రభుత్వం లేటెస్ట్ గా ఒక ఆర్డర్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘బాహుబలి 2’ కు కర్ణాటకాలో ముఖ్యంగా బెంగుళూరులో ఉన్న క్రేజ్ రీత్యా 45 కోట్లకు కొనుక్కున్న బయ్యర్ కు ఈ న్యూస్ షాకింగ్ గా మారడంతో ఈ బయ్యర్ ‘బాహుబలి 2’ కొనుక్కునే విషయంలో పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈమూవీని కన్నడంలో డబ్ చేసే అవకాశాలు తగ్గిపోవడంతో కర్నాటక ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకున్న ఈ నిర్ణయం రాజమౌళి ‘బాహుబలి 2’ కలక్షన్స్ వ్యూహాలను దెబ్బ తీస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో విడుదలైన ‘బాహుబలి’ కి కర్ణాటక ప్రాంతం నుంచి 40 కోట్ల వరకు కలక్షన్స్ వచ్చిన నేపధ్యంలో మరింత భారీ కలక్షన్స్ పై కన్ను వేసాడు రాజమౌళి. 

ఇది ఇలా ఉండగా ఆదివారం జరగబోతున్న ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఏ టాప్ సెలెబ్రెటీని పిలవకుండా కేవలం ‘బాహుబలి 2’ ను బాలీవుడ్ లో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ ను ముఖ్య అతిధిగా పిలవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కరణ్ జోహార్, కృష్ణంరాజు, రాఘవేంద్రరావులు మాత్రమే అతిధులు అని తెలుస్తోంది. 

అయితే కరణ్ జోహార్ వెంట కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ కూడ ఈ ఫంక్షన్ కు అతిధులుగా వస్తున్నారు అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ఫంక్షన్ లో టాప్ సెలెబ్రెటీల హడావిడికన్నా ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీల హంగామా కనిపించబోతోంది అని టాక్. ప్రముఖ న్యూస్ ఛానల్స్ అన్నీ లైవ్ టెలికాస్ట్ ఇవ్వబోతున్న ‘బాహుబలి 2’ ఫంక్షన్ బుల్లితెర రేటింగ్స్ విషయంలో ఎల్లుండి ఆదివారం సంచలనాలు సృష్టించడం ఖాయం అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: