తెలుగు ఇండస్ట్రీలోకి  కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత దర్శకుడిగా మారారు అవసరాల శ్రీనివాస్.  ఓవైపు నటిస్తూనే..మరోవైను సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జో అచ్యూతానందా రెండూ సినిమాలు మంచి విజయం సాధించాయి.  ప్రస్తుతం నవీన్ మేడారంలో అవసరాల హీరోగా నటిస్తున్న ‘బాబు బాగా బిజీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ సినిమా బాలీవుడ్ ‘హంటర్’ కి రిమేక్..అయితే అక్కడ ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చాయి.  

ఈ సినిమా అడల్ట్ కాంటెంట్ తో కూడుకున్నదని చాలా బోల్డ్ సీన్లు ఉన్నాయని  టాక్ వచ్చింది.  మరి తెలుగులో ఇలాంటి సినిమా ఎంత వరకు అంగీకరిస్తారన్న విషయం సినిమా విడుదలైన తర్వాత గాని తెలియదు. మొన్న టీజర్‌‌ను విడుదల చేసి తమ సినిమాలో బూతును పరిచయం చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌‌గా తెరకెక్కెంచబోతున్నామని దర్శకుడు నవీన్ మేడారం చెప్పినప్పటికీ.. ట్రైలర్ చూస్తే కామెడీ కన్నా రొమాన్సే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, యాంకర్ శ్రీముఖి చాలా హాట్ హాట్ గా కనిపిస్తున్నారు.  అంతే కాదు వీరితో చేస్తున్న రోమాన్స్ కూడా చాలా బోల్డ్ గానే కనిపిస్తుంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 13న బాబు బాగా బిజీ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, రవి ప్రకాష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ – ఎస్.బి. ఉద్దవ్, మాటలు – మిర్చి కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ బోద; ఛాయాగ్రహణం – సురేష్ భార్గవ, సంగీతం – సునీల్ కశ్యప్, నిర్మాత – అభిషేక్ నామా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – నవీన్ మేడారం.



మరింత సమాచారం తెలుసుకోండి: