తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ అంటే ఇప్పుడో ప్రభంజనం..కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు.  ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా మారిన పూరి జగన్నాధ్ బద్రి చిత్రంతో మంచి విజయం సాధించారు.  ఈ చిత్రంలో హీరోగా పవన్ కళ్యాన్, హీరోయన్లు అమిషా పటేల్, రేణు దేశాయ్.  అప్పడే పవన్, రేణు దేశాయ్ ల మద్య ప్రేమ చిగురించింది. తర్వాత పెద్ద అంగీకారంతో వీరిద్దరికీ వివాహం జరిగింది.  కొంత కాలం తర్వాత వీరిద్దరి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసకున్నారు.
Related image
అప్పటికే వీరికి అఖిరానందన్, ఆద్యలు పుట్టారు. ఇక పవన్ కళ్యాన్ వ్యక్తిత్వ జీవితం విషయానికి వస్తే..సమాజం పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి..ప్రజల కోసం ఏదైనా చేయాలన తప్పన కలిగినవారు. సినిమాలతో తాను కేవలం ఎంట్రటైన్ మెంట్ చేయగలను..కానీ నిజ జీవితంలో ఉన్న కష్టాలు ఎవరు తీర్చగలరు. అందుకే ప్రజలకోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ప్రజల తరుపు నుంచి పోరాడుతున్నారు.  

అందుకే ఆయనను రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో అభిమానిస్తున్నారు.  ఇవన్నీ పక్కనబెడితే..పవన్ ఇప్పుడు తన మాజీ భార్య రేణు దేశాయ్ ఇంట్లో తన కూతురు ఆద్య ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు.  పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల సంతానంగా ఆద్యా మార్చి 23,2010న జన్మించింది. నిన్న ఆద్యా తన ఏడో బర్త్ డే వేడుకలని పూణేలో జరుపుకోగా ఆ సెలబ్రేషన్స్ కి పవన్ కూడా హాజరు అయ్యాడట.  

ఆద్యా తో పాటు ఈ చిన్నారి ఫ్రెండ్స్ తోను పవన్ సరదాగా గడిపాడట. ఆద్యాతో పవన్ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోస్ ని చూసి పవన్ ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతున్నారు. ఒకవైపు కాటమరాయుడు చిత్ర సక్సెస్ తో ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటగా, ఆద్యా బర్త్ డే పిక్స్ ని చూసిన అభిమానుల  అవధులు లేకుండా పోయాయి. 

రేణు దేశాయ్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: