ముమైత్ ఖాన్..ఇప్పుడంత క్రేజ్ లేదుగానీ.. కొన్నాళ్ల క్రితం ముమైత్ ఖాన్ టాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది. ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ ఉందంటే.. సినిమాకు ఫుల్ క్రేజ్ వచ్చేది.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అని ముమైత్ ఖాన్ ఆట ప్రారంభిస్తే.. థియేటర్లు ఈలలతో దద్దరిల్లిపోయేవి.. కానీ క్రమంగా ముమైత్ ప్రాభవం తగ్గిపోయింది. 

Image result for mumaith khan movies
ఐటమ్ సాంగ్స్ తర్వాత.. ఒకటీ అరా క్యారెక్టర్ రోల్స్... మైసమ్మ ఐపీఎస్ అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా అంతగా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను నిర్వహిస్తున్న ముమైత్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు వెల్లడించింది. తన పర్సనల్ లైఫ్ గురించి డిటైల్డ్గ్ గా మాట్లాడింది.  

Related image
సినిమా ఫీల్డ్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఎఫయిర్స్.. ఈ విషయం గురించి అడిగితే.. తాను ఇప్పటివరకూ నలుగురితో సహజీవనం చేశానని చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్. తన తొలి సహజీవనం నాలుగేళ్ల పాటు కొనసాగిందట. రెండో సహజీవనం మూడున్నర ఏళ్ల పాటు నడిచిందట. మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు కలసి ఉందట. ఇక చివరి సహజీవనం మాత్రం ఏడాదిన్నరకే ముగిసిపోయిందట. 

Image result for mumaith khan movies

తనను తాను రొమాంటిక్, కేరింగ్ పర్సన్ గా కితాబిచ్చుకున్న ముమైత్ ఖాన్.. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించింది. ఓ వ్యక్తి కోసం ముమైత్ ఖాన్.. 27 లక్షల రూపాయలు వెచ్చించి సర్జరీ చేయించుకుందట. ఇప్పటికీ ఆమె మెదడులో 9 ఖరీదైన టైటానియం వైర్లు ఉన్నాయట. ఇక ముందు మాత్రం ఎవరి గురించి డబ్బు వేస్ట్ చేయకూడదని నిర్ణయించుకుందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: