ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఎత్తున రిలీజ్ అయిన మూవీ కాటమరాయుడు. ఈ మూవీ...సినీ ప్రేక్షకుల లెక్కల ప్రకారం భారీ హిట్. ఎందుకంటే ఎక్కడ చూసిన థియోటర్స్ లో హౌస్ ఫుల్ షోలు కనపడుతున్నాయి కాబట్టి. అయితే మూడు రోజుల తరువాత సీన్ మారుతుందని అంటున్నారు. ఎన్ని థియోటర్స్ లో ఇది హౌస్ ఫుల్ గా కనిపిస్తాయి? అనే క్వశ్ఛన్ వేసుకుంది ఫిల్మ్‌ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలోని రిపోర్ట్స్ ప్రకారం మూడు రోజుల తరువాత కాటమరాయుడు మూవీకి ప్రేక్షక ఆధరణ తగ్గనుందని తేలిసింది.

దీంతో తరువాత రిలీజ్ లిస్ట్ లో ఉన్న పెద్ద చిత్రాలు ఒక్కసారిగా వాటి రిలీజ్ డేట్స్ ని ముందుకు తీసుకువచ్చాయి. కాటమరాయుడు చిత్రం భారీ హిట్ అయితే దాని జోలికి వెళ్ళకూడదని హీరో వెంకటేష్, పూరీ మూవీ రోగ్ లు నిర్ణయించుకున్నాయి. కానీ కాటమరాయుడు చిత్రం అనుకున్నంత సక్సెస్ కాకపోవటంతో ఇతర పెద్ద చిత్రాలు రిలీజ్ డేట్స్ ఒక్కసారిగా ముందుకు వచ్చాయి.

దీంతో ఇవి మార్చి31న విడుదలవుతున్నాయి. నిజానికి ఏప్రిల్ 7వరకూ కాటమరాయుడు చిత్రం ప్రదర్శనలు జరుపుకోవాల్సి ఉండగా….ఇప్పుడు తాజా మార్పుతో మార్చి31తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మార్చి31న రిలీజ్ అవుతున్న మూవీ వివరాలను చూస్తే…వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కావాలి. అయితే కాటమరాయుడుకి అంత హైప్ లేకపోవటంతో సినిమాను ప్రీపోన్ చేసి..మార్చి 31నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అలాగే పూరి దర్శకత్వంలో ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమాను అదే రోజు రిలీజ్ చేస్తున్నారు.  దీంతో పాటు నయనతార లీడ్ రోల్ లో నటించిన డోరతో పాటు చిన్న సినిమాలు కారులో షికారుకెల్తే, ఎంతవరకు ఈ ప్రేమ కూడా 31నే రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని మూవీలు ఒక్కసారిగా ప్రి రిలీజ్ డేట్ కి వెళ్ళటంతో ఇండస్ట్రీలో కాటమరాయుడు మూవీ ఎఫెక్ట్ అంతగా లేదని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో మార్కెట్ ని షేక్ చేయాల్సిన కాటమరాయుడు సాధారణ మూవీనే అని ఇండస్ట్రీ తేల్చినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: