తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  అల్లు రామలింగయ్య తనయుడు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అయిన అల్లు అర్జున్ సినిమా వాతావరణంలో పెరగడంతో సినిమాలపై ఇంట్రెస్ట్ తో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత బన్నీ,ఆర్య,దేశముదురు చిత్రాలతో మెగాపవర్ ఏంటో చూపించాడు.  ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ పేరు తెచ్చుకున్న బన్నీ గత సంవత్సరం ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.  
Related image
ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో బన్నీపై రక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఆ మద్య ఓ ప్రవేట్ కార్యక్రమానికి వచ్చిన బన్నీ ముఖానికి మాస్క్ వేసుకుని రావడం చూసి అసలు ఏమైందని వార్తలు వచ్చాయి.  రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నాడని, ముఖం మీద రాషెస్ రావడంతో కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయ.  
Image result for duvvada jagannadham first look
ఈ విషయం స్పందించిన బన్నీ అబ్బే ! అటువంటిదేమీ లేదని అంటున్నారు కానీ గత వారం రోజులుగా హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి దాంతో అల్లు అర్జున్ స్వల్ప అస్వస్థత కు గురయ్యాడట. ఈ కారణం చేత షూటింగ్ లో  పాల్గొనలేక పోతున్నాడట అల్లు అర్జున్. విషయం మరింత పెద్దది కాకుండా ఉండటానికి చిత్ర యూనిట్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది.  వాస్తవానికి గత వారం రోజుల నుంచి బయట ఎండలు మండుతున్నాయి..దీంతో షూటింగ్ చేయడం కాస్త కష్టమే అని అనుకుంటున్నార ప్రజలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: