‘ఇంద్ర’, ‘నరసింహనాయుడు’  సినిమాల పేరు చెప్పగానే గుర్తుకువచ్చే పేరు రచయిత చిన్నికృష్ణది. అతి, అతిశయం లేకుండా ఆయన మాట్లాడడు.  ఈ మధ్య ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  రచయితగా  తాను ఇంతవరకు తెలుగులో కథలు రాసిన సినిమాలన్నీ హిట్‌ అని చెప్పాడు. అంతే కాదు  అతని గత చిత్రం ‘జీనియస్‌’ కూడా హిట్టేనని అంటున్నాడు. కానీ ఆ  సినిమా ఫ్లాప్‌ అయిందని ఆ సినిమా  నిర్మాత ఎంతగా మొత్తుకున్నాడో తెలిసిందే.  

చిన్నికృష్ణ చెపుతున్న లాజిక్‌ ఏంటంటే ఆ సినిమాని మూడు కోట్లలో తీస్తే హిట్టవుతుందని నిర్మాతకు  చెప్పాడట. కానీ ఆ నిర్మాత అజ్ఞానం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టారని, అంచేత రిజల్ట్‌ బాగా రాలేదని, కానీ కథకుడిగా తాను ఫెయిలవలేదని, ఆ చిత్రం అనువాద హక్కుల్ని తమిళ, మలయాళ భాషల్లో కొనుక్కోవడమే అందుకు నిదర్శనమని  అంటూ లాజిక్కులు చెప్పాడు. అంతేకాదు ‘బధ్రీనాద్’ సినిమా ఓ గొప్ప చిత్రమని, తానొక గొప్ప అంశాన్ని అందులో చర్చించానని అందుకే  త్వరలోనే హిందీలో కూడా ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారని, దీనిని బట్టి ఆ సినిమాలో  కూడా తాను ఫెయిల్‌ అవలేదని చిన్నికృష్ణ చెప్పాడు.

 దీనితో ఆగకుండా మెగా స్టార్ ఫై కూడా సెటైర్స్ వేసాడు. ‘ఇంద్ర’ సినిమా తరువాత చిరంజీవి కి చాలా మంచి కధలు చెప్పానని కానీ ఎందుకో చిరూ వాటిని ఓకే చేయలేదని చెపుతూ చిరంజీవి 150 వ సినిమాకు ఒక మంచి కధను చెప్పానని అది కూడా వదులుకుంటే  ఆయన దురదృష్టం అన్నారు. ఆయన కాదంటే ఏ పవన్ కో ఎన్టీఆర్ కో వినిపించి వారి తో తనే దర్శకత్వం వహిస్తానని  చెపుతున్న చిన్ని కృష్ణ మాటలు   మితి మీరిన విశ్వాసం అనుకోవాలా  లేక బలుపు అనుకోవాలా ఆయనకే తెలియాలి అందు కే కాబోలు ప్రస్తుతం ఆయన పేరు చెపితే నిర్మాతలు  దర్శకులు పరుగులు తీస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: