తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు ఎం ఎం కీరవాణి.  ముఖ్యంగా స్టార్ దర్శకుల సినిమాలకు కీరవాణి సమకూర్చిన సంగీతం ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది.  రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన అన్నమయ్య,శ్రీరామదాసు  చిత్రాల పాటలు ఇప్పటికీ ఏ దేవాలయాల  వద్దకు వెళ్లినా వినిపిస్తూనే ఉంటాయి.  ఇక భారత దేశం గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాలకు ఈయన సంగీతం అందించారు.  తాజాగా కీరవాణి కొంత మంది దర్శకులపై ఫైర్ అయ్యారు..మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో బ్రెయిన్ లెస్ డైరెక్టర్లు ఎక్కువగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు.  అంతే కాదు బ్రెయిన్ లెస్ డైరెక్టర్లు ఉన్నంత కాలం నాకు సరైన అవకాశాలు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
Image result for సంగీత దర్శకుడు కీరవాణి సంచలన వ్యాఖ్యలు
రెండేళ్ల క్రితం 'త్వ‌ర‌లో స్వ‌చ్ఛందంగా సినిమాల నుంచి నిష్క్ర‌మిస్తా' అని ప్ర‌క‌టించారాయ‌న‌.  ఇన్నేళ్ల ప్రస్థానంలో తనకు అత్యంత సవాలుగా నిలిచిన విషయం సంగీతం అందించడం కాదని, సినీపరిశ్రమలో ఉన్న చాలామంది ఫూల్స్ తో కలసి పనిచేయాల్సి రావడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సంగీత దర్శకుడిగా తన శైలిని అర్ధం చేసుకోని వ్యక్తులతో కలసి తాను చాలా సార్లు పనిచేశానని, అటువంటి వ్యక్తులతో పనిచేసేటప్పుడు తనకు చాలా కష్టంగా, పీడకలలాగా ఉండేదని ఆయన అన్నారు. సింపుల్ ట్యూన్స్ కట్టడమే చాలా కష్టమని, కానీ సంక్లిష్టమైన ట్యూన్స్ కట్టడం తేలికని కీరవాణి తెలిపారు.
Related image
ఇక తన తమ్ముడు ఎస్ ఎస్ రాజమౌళి వెంట నేనున్నంత వరకు అతన్ని చేరుకోవడం ఎవరి తరం కాదని , అతడి స్టాండర్డ్ వేరని అంటున్నాడు కీరవాణి .  రాజమౌళికి నేను బెస్ట్‌ మ్యూజిక్‌ ఇవ్వడానికి కారణం అతను నా మాట వింటాడు.  రాజమౌళికి పని పట్ల భక్తి, ప్రేమ ఉన్నంత వరకూ అతని స్టాండర్డ్స్‌ను ఎవరూ చేరుకోలేరు. ఇది వంద శాతం నిజం.  దర్శకుడు రాథవేంద్ర రావు తన గురువని చెప్పిన కీరవాణి తెలుగు సాహిత్యం అంతమొందుతోందని అభిప్రాయ పడ్డారు. వేటూరిగారి మరణం, ‘సిరివెన్నెల’ అనారోగ్యం కారణంగా తెలుగు సాహిత్యం బ్రస్టుపట్టిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Image result for keeravani rajamouli

కీరవాణి ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: