తెలుగు సినిమా అవార్డ్ ఫంక్షన్ లలో ప్రధానంగా కోరవడేది .. ఎంటర్టైన్మెంట్ . పాటలు , డాన్సులు కాదు కానీ చాలా ముఖ్యంగా తెలుగు సినిమా ఫంక్షన్ లలో హోస్టింగ్ బాగా బోర్ కొడుతుంది. యాంకర్ లలో సుమ లేదు అంటే అవార్డ్ ఫంక్షన్ ఇక నీరసంగా సాగుతుంది అనే అర్ధం. తాజాగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఐఫా ప్రతిష్టాత్మక ఈవెంట్ మాత్రం రానా - నానీ దయ వలన సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. ప్రోగ్రాం స్టార్టింగ్ నుంచీ ఆఖరి వరకూ రానా - నానీ ప్రోగ్రాం ని తీసుకువెళ్ళిన తీరు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి . నానీ - రానా ఇద్దరూ బావా బావా అంటూ స్టేజీ ఎక్కింది మొదలు ఆఖరి వరకూ ఫుల్ హ్యాపీస్ తో జనాన్ని ఇంటికి పంపించారు.


  మొదట అఖిల్ మీద మొదలెట్టిన జోకులు నాన్ బాహుబలి రికార్డులు అంటూ కొత్త ట్రెండ్ సృష్టించడం మీద వరకూ వెళ్ళాయి. అల్లూ అర్జున్ చెప్పను బ్రదర్ , ఫేక్ కలక్షన్ గొడవలు , మీడియా మీద సెటైర్ లు చలానే పేలాయి. హీరో విజయ్ దేవరకొండ ని స్టేజీ మీదనే స్పెషల్ గా ఆడుకున్నారు వీరిద్దరూ. అతను వేసుకొచ్చిన సూట్ ని ఎక్కడ కుట్టించావ్ అంటూ ఏడిపించగా , నువ్వు కుట్టించే టైలర్ షాప్ లోనే అన్నా అంటూ విజయ్ నానీ కి పంచేస్ విసిరాడు.


మధ్యలో బెస్ట్ కమీడియన్ అవార్డ్ గెలుచుకున్న ప్రియ దర్శి కి నానీ కి మధ్య కామెడీ సీన్ వర్క్ అయ్యింది. పింక్ గార్లాండ్ ని తీసుకెళ్ళి ప్రగ్యా జైస్వాల్ మెడలో వేసిన దర్శి తో ప్రాగ్య డాన్స్ చెయ్యాల్సి వచ్చింది. ట్రూత్ లైట్ అనీ , ఆఫ్టర్ పార్టీ కి టైం అవుతోంది అనీ , వెంకటేష్ కుర్ర హీరోల మధ్య సయోధ్య పెట్టడం ఇలా చాలా ఆహ్లాదంగా ప్రోగ్రాం సాగింది. బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్న తారక్ అవార్డ్ తెలుగు సినిమా కలక్తివ్ ఎఫర్ట్ అంటూ అందరినీ స్టేజీ మీదకి తీసుకొచ్చాడు. బెస్ట్ డైరెక్షన్ , బెస్ట్ మూవీ లో కూడా జనతా గ్యారేజ్ పలు అవార్డులు గెలుచుకుంది. సినిమాకి గాను సమంత కి బెస్ట్ హీరోయిన్ అవార్డ్ దక్కింది. మొత్తం మీద నానీ - రానా సందడి తో ఏడాది ఐఫా ఫుల్ ఖుషీ గా ముగిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: