తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు తనయుడు వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  క్లాస్, మాస్ చిత్రాలతో అప్పట్లో దుమ్మురేపారు..తర్వాత కాలంలో ఫ్యామిలీ హీరోగా మారారు.  వెంకటేష్ పవర్ ఫుల్ హీరోయిజమే కాదు పడీ పడీ నవ్వించే కామెడీ కూడా చేస్తారు.  గత కొంత కాలంగా మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న వెంకటేష్ తాజాగా ‘గురు’ చిత్రంతో అభినుల ముందుకు రాబోతున్నాడు.  ఇప్పటికే ఈ చిత్రం బాలీవుడ్, కోలీవుడ్ లో  మంచి విజయం సాధించగా తెలుగులో ‘గురు’ గా రిమేక్ చేశారు.  
Image result for guru movie venkatesh
వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రం ఈ నెల 31 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..అయితే హిందీలో , తమిళంలో మంచి హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు..అందుకే  రిలీజ్ కి ఒకరోజు ముందుగానే మీడియాకి షో వేస్తున్నారు . వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రితికా సింగ్ బాక్సర్ గా నటిస్తోంది .
Image result for guru movie venkatesh
ఈ చిత్ర  విశేషం ఏంటంటే రితికా సింగ్ నిజంగానే బాక్సర్ కావడం పైగా ఇదే పాత్రని ఇంతకుముందు తమిళం లో అలాగే హిందీలో పోషించడం అందుకు జాతీయ స్థాయిలో అవార్డు ని సైతం అందుకోవడం విశేషం. ఇండస్ట్రీలో వెంకటేష్ తో నటించిన సీనియర్ హీరోలు  చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున లు ఎప్పుడో యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయారు ఒక్క వెంకటేష్ తప్ప . ఈ సినిమాపై వెంకీ చాలానే ఆశలు పెట్టుకున్నాడు . మరి ఈ సినిమా పెద్ద హిట్ అయి యాభై కోట్ల క్లబ్ లో చేరుతుందా చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: