ఏప్రియల్ లో విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ ఏరేంజ్ లో కలక్షన్స్ సాధిస్తుంది అన్న అంచనాల మధ్య టాలీవుడ్ విశ్లేషకులు బిజీగా ఉన్నారు. అయితే ఈసినిమా ఇంకా విడుదల అవ్వకుండానే అనుష్క వల్ల ‘బాహుబలి 2‘ నిర్మాతలకు ఏర్పడిన 20 కోట్ల నష్టానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

సామాన్యంగా ఒక హీరోయిన్ కోసం కొట్లలో భారీ పారితోషికాలను ఇచ్చి టాప్ హీరోల సినిమాలకు క్రేజ్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దీనికి విరుద్ధంగా ‘బాహుబలి’ రెండు భాగాలలో నటించినందుకు గాను అనుష్కకు ఇచ్చిన పారితోషికానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఆమె వల్ల ‘బాహుబలి 2’ నిర్మాణంలో ఈసినిమా నిర్మాతలకు అనుకోని నష్టాలు వచ్చాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆశక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే ‘బాహుబలి’ పార్ట్ వన్ షూటింగ్ తీస్తున్నప్పుడే ‘బాహుబలి’ పార్ట్ 2కు సంబంధించిన కొన్ని సీన్స్ రాజమౌళి షూట్ చేసాడు అని తెలుస్తోంది. అయితే ‘బాహుబలి’ విడుదల అయిన తరువాత ‘బాహుబలి 2’ షూటింగ్ కు అనుకోకుండా ఆలస్యం జరగడం మధ్యలో అనుష్క శరీరం భారీగా పెరిగి పోవడంతో అనుష్కకు సంబంధించి గతంలో తీసిన సీన్స్ ను చాలామటుకు రీషూట్ చేయడమే కాకుండా అనుష్క ఫిజిక్ కు సంబంధించి భారీ మార్పులు గ్రాఫిక్స్ సహకారంతో చేయవలసి వచ్చింది అని తెలుస్తోంది. 

దీనితో ఈ అనుకోని రీషూట్స్ కు అదేవిధంగా గ్రాఫిక్స్ కు అదనంగా అనుష్క వల్ల దాదాపు 20 కోట్లు ఖర్చు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు మొదట్లో రాజమౌళి ‘బాహుబలి’ కథను ఒకే ఒక్క భాగంలో తీద్దామని ప్రయత్నించినా అది కుదరని నేపధ్యంలో ‘బాహుబలి 2’ పార్ట్ నిర్మాణం కూడ చేయవలసి వచ్చింది అని అంటారు.  
ఈ అనుకోని కారణాలు వల్ల ‘బాహుబలి’ చిత్ర నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ ఖర్చుల అంచనాలలో మరో 40 కోట్లు వృథా అయింది అన్న వార్తలు కూడ ఉన్నాయి.

దీనికితోడు ఇప్పుడు అనుష్కకు సంబంధించిన అదనపు ఖర్చులు కూడ చేరాయి అని తెలుస్తోంది. అందుకే కాబోలు రాజమౌళి ‘బాహుబలి 2’ బిజినెస్ ను కనీవినీ ఎరుగని స్థాయిలో దాదాపు 500 కోట్లకు పైగా భారీబిజినెస్ చేసాడు అన్న వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: