యాంకర్ గా బుల్లితెర ఆడియెన్స్ ను ఉర్రూతగూలిస్తున్న అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సొగసులతో ఆకట్టుకుంటుంది. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ రీసెంట్ గా సుప్రీం హీరో సాయి ధరం తేజ్ విన్నర్ లో ఐటం సాంగ్ కూడా చేసింది. సూయ సూయ అనసూయ అంటూ సాంగే ఈ సాంగ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు కాని అమ్మడి అందాలు మాత్రం అదరగొట్టేసింది.  


ఇక మరో పక్క వస్తున్న అరకొర అవాకాశాలను కాదనకుండా చేస్తున్న ఈ అమ్మడు చూపరులను కవ్వించేందుకు ఈవెంట్ ఏదైనా సరే తన ఓర చూపులతో మనసులను లాగేస్తుంది. ఇక రీసెంట్ గా జరిగిన ఐగా అవార్డ్ వేడుకల్లో ఓ యాంకర్ గా కాకుండా చిన్నపాటి హీరోయిన్ గా సోయగాలను గుమ్మరించింది అనసూయ.


ఆల్మోస్ట్ బ్యాక్ మొత్తం కనిపించేలా అమ్మడు చూపించిన వీపు అందాలు అదిరేలా ఉన్నాయి. ఐఫా అవార్డుల్లో అందాల ఆకర్షణ అందరిని ఆకట్టుకున్నాయి. హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ ఈవెంట్ లో రెచ్చిపోయి మరి అందాల ప్రదర్శన చేశారు. దర్శక నిర్మాతల కళ్లల్లో పడేందుకు ఎవరికి వారు తమ అందాలకు పని చెప్పారంటే నమ్మాలి.  


అందరికంటే అనసూయ అందాలు మాత్రం అదిరిపోయాయి. యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై సర్ ప్రైజింగ్ అందాలతో షో ఎట్రాక్ట్ చేస్తున్న అమ్మడు ప్రత్యేకంగా ఈవెంట్ లలో కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఓ యాంకర్ గా ఈ రేంజ్ కేపాసిటీ సాధించిన అనసూయను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: