తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ నటించిన ‘జెమిని’ చిత్రంలో హాట్ హాట్ గా కనిపిస్తూ..కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన భామ నమిత తర్వాత వచ్చిన సొంతం,ఒక రాధ ఇద్దరు కృష్ణులు చిత్రాల్లో చాలా స్లిమ్ గా అందంగా కనిపించింది.  తర్వాత ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలం తర్వాత నమిత అస్సలు గుర్తుపట్టనంతగా మారిపోయింది..లావుగా తయారైంది.  1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది. అలాంటి నమిత బొద్దుగా తయారు కావడంతో సినిమా చాన్సులు తగ్గుతూ వచ్చాయి.
Related image
ఆ మద్య బాలకృష్ణతో ‘సింహ’ లో ‘సింహమల్లే వచ్చాడే’ అనే పాటలో చాలా అందంగా కనిపించింది.    తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన నమిత తాజాగా మరో సినిమాతో అభిమానుల ముందుకు రాబోతుంది.  ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రెండ్ ని ఫాలో అవుతూ న్యూ మూవీ చేస్తోంది. ' పొట్టు ' పేరుతో తమిళ్ లో తెరకెక్కుతున్న మూవీలో నమిత సగం మనిషి.. సగం మృగం కలగలిసిన ఓ వింత క్యారెక్టర్ చేస్తోంది.
Image result for namitha hot photos
హారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో తాను చేస్తున్న క్యారెక్టర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకూ ట్రై చేయలేదని చెబుతోంది.  గతంలో గ్లామర్ పాత్రలు పోషించిన నమిత ఈ సారి ఓ మృగంగా కనిపంచడం పై అందరికీ ఆసక్తి రేకెత్తుతుంది.  ఈ మూవీతో తనకి మళ్ళీ బ్రేక్ రావడం ఖాయం అని కాంఫిడెంట్ గా వుంది. తమిళ్ తో పాటూ తెలుగులో కూడా రిలీజ్ కాబోయే ఈ మూవీతో మళ్ళీ తెలుగులో బిజీ అవుతానంటోంది నమిత. 


మరింత సమాచారం తెలుసుకోండి: