తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు వారసుడిగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.  ఈ సంవత్సరం బాలయ్య 100 వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ లాంటి హిస్టారికల్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.  అలాంటి బాలకృష్ణ సరసన నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా నో చెప్పే అవకాశం లేదు.  
Image result for keerthi suresh
కానీ తాజాగా ఓ మళియాల బ్యూటీ బాలయ్యతో చాన్స్ వస్తే నో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.  అసలు విషయానికి వస్తే..నేను శైలజ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మళియాల బ్యూటీ కీర్తి సురేష్ వరుస విజయాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉంది.  తాజాగా ఓ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ తో నటించే ఛాన్స్ వస్తే ఈ భామ కాదని చెప్పి అవమానించిందట.  
Image result for keerthi suresh
దీంతో ఆఫర్ ఇచ్చిన సినీ పెద్దలు కాస్త సీరియస్ కావడంతో..అబ్బే నా ఉద్దేశ్యం అది కాదని..తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ అని అలాంటిది  అంత పెద్ద సీనియర్ హీరోతో చేయడం అంటే కాస్త భయంగా ఉందని సర్థిచెప్పిందట.
Image result for balakrishna krishna vamsi
అయితే భవిష్యత్ లో తప్పకుండా బాలకృష్ణ సార్ తో నటిస్తానని అంటోంది కీర్తి సురేష్. ఈ భామకు తెలుగులో చాలా అవకాశాలే వస్తున్నాయి కానీ అంత తొందరగా అంగీకరించడం లేదు . బాలయ్య - కృష్ణవంశీ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేస్తే నో చెప్పేసింది . 


మరింత సమాచారం తెలుసుకోండి: