తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటిన లారెన్స్ హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో కూడుకున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ముని చిత్రంతో మొదలైన కాంచన, కాంచన 2 (గంగ) మంచి విజయాలు సాధించాయి.  తాాజాగా కన్నడంలో సూపర్ హిట్ అయిన శివలింగ చిత్రాన్ని తెలుగులో తీస్తున్నారు.   ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్,టీజర్స్ ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ని తీసుకొచ్చాయి. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన శివలింగ తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.


హరర్ జానర్ లో ఉన్న ఈ సినిమాను అభిమానులకు తప్పక ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించినప్పటికి కొన్ని కారణాల వలన మరో వారం ముందుకు వెళ్ళాల్చి వచ్చింది.  ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలోసుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ మీడియా   అధినేత మ‌ల్కాపురం శివ‌కుమార్‌, నిర్మాత ర‌మేష్ పిళ్ళై పాత్రికేయుల‌తో మాట్లాడారు.

Displaying 6G9B8273 jpg.jpg

మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ.. శివలింగ సినిమా చూశాను. చాలా బాగుంది.హార్రర్ సినిమాల్లో ఇది నెక్ట్స్ లెవెల్ లో ఉండే చిత్రమిది. తెలుగులో మా సురక్ష బ్యానర్ ద్వారా విడుదల చెస్తున్నాము.కాంచ‌న‌, గంగ చిత్రాల స‌క్సెస్‌ల‌తో లారెన్స్ న‌ట‌నేంటో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసింది. క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ హీరోగా వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డంలో రూపొందిన శివ‌లింగ చిత్రం అక్క‌డ పెద్ద స‌క్సెస్ కావ‌డంతో తెలుగు, త‌మిళంలో లారెన్స్‌, రితిక సింగ్‌ల‌పై అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ర‌మేష్ పిళ్లై నిర్మించారు. రీసెంట్‌గా గురు చిత్రంతో స‌క్సెస్ సాధించిన రితిక సింగ్ హీరోయిన్‌గా న‌టించిన చిత్ర‌మిది. హ‌ర్ర‌ర్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కులకు నచ్చేలా సినిమా ఉంటుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: