మల్టిటాలెంటెడ్ పర్సన్ ప్రభుదేవా సమర్ధత తెలియనివారు ఉండరు. హీరోగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా టాలీవుడ్, కోలీవుడ్ లలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్న సెలబ్రిటీ ప్రభుదేవా. అటువంటి ప్రభుదేవా కు తాను దర్శకత్వం వహించిన సినిమాను తానే తీశానని నమ్మిమించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. విచిత్రం గా ఉంది కదూ..? కాని ఇది మాత్రం నిజం. ప్రభుదేవా ప్రస్తుతం హిందీ లో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టిప్స్ ఆడియో అధినేత కుమార్ తురాణి తనయుడు గిరీష్ తురాణి హీరోగా పరిచయం అవుతున్నాడు.

అయితే ఈ సినిమా ప్రారంభం ముందు టిప్స్ అధినేత కుమార్ తురాణి ప్రభు కు ఫోన్ చేసి ఒక మంచి తెలుగు సినిమా తన దృష్టికి వచ్చింది అని చెపుతూ ఆ సినిమాకు ప్రభుదేవాను దర్శకత్వం వహించావలసిందని కోరాడట. దానికి ప్రభుదేవా తాను తప్పక దర్శకత్వం వహిస్తానని, ఆ తెలుగు సినిమా  సిడి ని తనకు చూడడానికి పంపించవలసినదిగా నిర్మాతను కోరాడట. కాని మర్నాడు ప్రభుదేవా దగ్గరకు వచ్చిన సిడి ప్రభు చూసి షాక్ అయ్యాడట. దీనికి కారణం ఆ సినిమా ప్రభుదేవా తెలుగులో మొట్టమొదటిగా దర్శకత్వం వహించిన ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ సినిమా సిడి. వెంటనే షాక్ నుండి తేరుకున్న ప్రభు ఆ సినిమా తనదేనని సదరు నిర్మాత కుమార్ తురాణి కి చెప్పినా, మొట్టమొదట కుమార్ నమ్మలేదట. చివరకు చేసేది లేక సినిమా టైటిల్స్ లో తన పేరును చూపెట్టడంతో టిప్స్ ఆడియో అధినేత కుమార్ నమ్మి, తన కుమారుడిని హీరోని చేసే బాధ్యత ప్రభుదేవా కి అప్పగించాడట.

ఈ విషయాలు ఈ మధ్యనే భాగ్యనగరం వచ్చిన ప్రభుదేవా సరదాగా మీడియా తో పంచుకున్నాడు. ఏ వ్యక్తికైనా తాను ఎవరో తననే నిరుపించుకోమని ఎవరైనా అడిగితే ఎంత బాధకలుగుతుందో ప్రభుదేవా కు కూడా తాను దర్శకత్వం వహించిన సినిమాను తనదే అని నిరూపించుకోవడం ఒక విచిత్రమైన అనుభవమే.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: