గత రెండు రోజులుగా ఫిల్మ్ నగర్ లో ఒక విచిత్రమైన వార్త హడావుడి చేస్తోంది. అదేమిటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెయిన్ నుంచి తిరిగిరాగానే ఒక బడా ప్రొడ్యూసర్ ను తన ఇంటికి పిలిపించుకొని చివాట్లు పెట్టాడట. ఈ ప్రొడ్యూసర్ పవర్ స్టార్ తో ఒక మెగా హిట్ సినిమా తీసిన నిర్మాత అని కూడా చెపుతున్నారు. వరసపెట్టి బడా బడా సినిమాలు తీసే ఈ బడా నిర్మాత తన సినిమాలలో పనిచేసిన టెక్నీషియన్స్ కు మాత్రం పేమెంట్ ఇచ్చేటప్పుడు చుక్కలు చూపెట్టే అలవాటు ఉందట. ఒక పట్టాన తన జేబులోంచి డబ్బును ఎవరికీ ఇచ్చే అలవాటు ఈయనకు లేక పోయినా పైకి బిల్డప్ లు మాత్రం చాలా బడా గా ఇస్తాడట.

ఆ నిర్మాత నిర్మించిన పవన్ సినిమాలో పనిచేసిన కొంతమంది టెక్నీషియన్స్ పవన్ దగ్గర తమ బాధ చెప్పుకుంటే పవన్ ఉగ్రరూపం దాల్చి ఆ నిర్మాతను వాయి౦చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆ నిర్మాత పేరు ప్రస్తుతానికి బయటకు రాకపోయినా, అది బండ్ల గణేషా..? అంటూ ఉహాగానాలు మాత్రం ఫిల్మ్ నగర్ లో తారాస్థాయిలో ఉన్నాయి. ఇంతకీ పవన్ చేత తిట్లు తిన్న ఆ నిర్మాత ఎవరో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఓపిక పట్టాలి అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. హీరోలకు, హీరోయిన్స్ కి కోటానుకోట్లు ఇచ్చే మన బడా నిర్మాతలు, అదే సినిమాలలో పనిచేసే టెక్నీషియన్స్ కు పారితోషికాల విషయంలో ఏడిపించడం ఆ బడా నిర్మాత సంస్కారం అనుకోవాలా..? లేక అలవాటు అనుకోవాలా..? ఆయనకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: