టాలీవుడ్ లో నితిన్ హవా నడుస్తోంది, ప్రస్తుతం బేడ్ పిరియడ్ రన్ అవుతున్న పూరి తనకు నితిన్ ద్వారా లక్ వస్తుందేమోనని, ఒక ప్రయత్నం చేస్తున్నాడు. పూరి నితిన్ ను హీరోగా పెట్టి వైష్ణో అకాడమీ బ్యానర్ పై ఒక సినిమా నిర్మించ బోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

హీరో నితిన్ నటిస్తున్న ‘కొరియర్ బోయ్ కళ్యాణ్’ సినిమా తరువాత  పూరి, నితిన్ ల సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం పేరు ‘హార్ట్ ఎటాక్’ అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా సూపర్ హిట్ తరువాత నితిన్ రేంజ్ పెరిగి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న గౌతమ్ మీనన్ సినిమా తరువాత సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, నందినీ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.

 కానీ ఈ రెండు సినిమాలకంటే ముందుగానే పూరి నితిన్ ల సినిమా ఉంటుంది అంటున్నారు. మరి ఈ సినిమాతో పూరి తెలుగు ప్రేక్షకులకు ఎటువంటి హార్ట్ ఎటాక్ ఇస్తాడో చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: