వరుస పెట్టి వచ్చిన ఆరు పరాజయాలు తరువాత హిట్ కొట్టిన రవితేజా ‘బలుపు’ సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపించిన ఒక హీరోయిన్ ఐరన్ లెగ్ ఇమేజ్ ను కూడా పోగొట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అంటే శ్రీరామదాసు సినిమాలో సీతగా నటించిన అర్చన.

బిందుమాధవి, మాధవీ లత, వేదా ఇలాంటి వారంతా తెలుగు అమ్మాయిలే అయినా వారందరికీ ఐరన్ లెగ్ హీరోయిన్స్ అన్న ముద్ర పడింది. వారిలో ముఖ్యంగా అర్చన (వేదా) కు ఈ ఇమేజ్ మరీ ఎక్కువ.ఈమె ఏదైనా సినిమాలో కనిపిస్తే చాలు ఆ సినిమా ఎంత పెద్దదైనా ఫ్లాప్ అవుతుందని గుడ్డి నమ్మకం టాలీవుడ్ లో ఉంది. గతంలో మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ సినిమాలో ఈమె ఉండటం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందని మహేష్ అభిమానులు అప్పట్లో బాధ పడ్డారు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ‘బలుపు’ సినిమాలో చిన్న సీన్ లో సెక్సీగా కనిపించి మురిపించింది, కానీ మాస్ మహారాజా సినిమా మటుకూ హిట్ టాక్ సొంతం చేసుకుంది .

దీనితో అర్చనకు పట్టిన ఐరన్ లెగ్ సెంటిమెంట్ తుడిచి పెట్టుకు పోయింది కాబట్టి ఇక ఆమెకు కూడా మంచిరోజులు వచ్చినట్లే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అదృష్టం కలిసి రాక చిన్నచిన్న పాత్రలు చేస్తున్న అర్చన మంచి డాన్సర్, కానీ ఈ విషయం ఎంత మందికి తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: