హీరో సూర్య నటించిన ‘సింగం’ నిన్న దక్షణ భారతం యావత్తు విడుదలైంది. ఈ సినిమాకు మన టాలీవుడ్ లో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తరువాత హీరో సూర్యకి హిట్ దక్కిందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన క్రేజీ హన్సిక అనుష్క లు షూటింగ్ సమయంలో తరుచూ గొడవ పడేవారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

ఇంకా ఆ గొడవలు గురించి వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా దర్శకుడు హరి మీడియాతో మాట్లడుతూ యివన్నీ గాలి వార్తలని ఒక పెద్ద హీరో సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ ఉన్నప్పుడు వారిద్దరి మధ్యా సమ ప్రాధాన్యత ఇచ్చే ఈ సీన్స్ విషయంలో ఏదైనా అనుకోని తేడాలు వచ్చినప్పుడు ఇటువంటి వార్తలు వస్తూ ఉంటాయని ప్రస్తుతం వారిద్దరూ కూడా సూర్యతో పాటు సమానంగా ‘సింగం’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు హరీ ఈజీగా తీసి పడేసాడు. ఈ సినిమాకు ఇదొక రకమైన పబ్లిసిటీ అనుకోవాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: