రాన్ జానా...ఈ మ‌ద్యే రిలీజై బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన చిత్రం.    ధ‌నుష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా బి టౌన్ కుర్రకారుని ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేసింది. అయితే ఈ సినిమాను త‌మ దేశంలో ఆడ‌నిచ్చే ఛాన్సేలేద‌ని పాకిస్తాన్ నిషేదం విధించింది.
��
నిజానికి పాకిస్తాన్ లో మ‌న బాలీవుడ్ లో హిటైన సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. షారుక్ సినిమాలంటే అక్కడివారు ప‌డిచస్తారు. అయితే ఒక్కోసారి స్టార్స్ తో సంబంధం లేకుండా క‌ధాబలం వున్న చిత్రాల‌ను కూడా ప్రద‌ర్శిస్తుంటారు. ఆ రూటులోనే రాన్ జానా వెళ్లింది. కానీ ముస్లిం సంస్కృతి , వారి మ‌నోభావాల‌ను దెబ్బతీసే విధంగా సినిమా వుంద‌ని ప్రజ‌లు మండిపడుతున్నారు. హిందు ముస్లిం యువ జంట  పీక‌ల్లోతు ప‌డ‌టాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారట .దీంతో ఇస్లామిక్ సంప్రదాయ వాదుల‌తో వివాదాలు త‌లెత్తే అవ‌కాశం వున్నందున‌.. వారి అభీష్టం మేర‌కే సినిమా ప్రద‌ర్శన‌ను నిషేదిస్తున్నట్టు  బోర్డ్ స‌భ్యులు  ప్రక‌టించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: