తెలుగు బుల్లితెర ‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా పరిచయం అయిన అనసూయ అతి కొద్ది కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది.  ఈ అమ్మడు వేసుకునే బట్టలు, మాట్లాడే తీరు జనాలకు ముఖ్యంగా కుర్రకారుకి బాగా దగ్గరైంది.  అంతే కాదు ఆ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలోనే ఇతర ప్రోగ్రామ్స్ ల్ చాన్స్ లు రావడంతో..అప్పట్లో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ కూడా చెప్పింది.  ఆ తర్వాత వెండితెరపై చాన్స్ కొట్టేసిన అనసూయ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో నటించింది.  తర్వాత ‘క్షణం’ చిత్రంలో  నెగిటీవ్ పాత్రలో నటించింది.  
Related image
రీసెంట్ గా మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రంలో కూడా కొద్దిసేపు కనిపించి ఐటమ్ సాంగ్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.   ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయకు వెండితెరపై వరుస చాన్స్ లు వస్తున్నాయి.  తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  
Image result for anasuya hot photos
అయితే ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ చాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చాయి.  అయితే ఈ సినిమాలో అనసూయది చిన్న పాత్ర అని కాకపోతే ఓ ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాట్లు తర్వాత వార్తలు వచ్చాయి.  కానీ నిజానికి ఈ సినిమాలో హీరో రాంచరణ్ కి పూర్తిగా సపోర్టింగ్ క్యారెక్టలో కనిపిస్తుందట అనసూయ.  ఓ రకంగా చెప్పాలంటే.. హీరోయిన్‌ కాకున్నా దాదాపు హీరోయిన్‌ స్థాయి పాత్ర అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
Image result for ram charan anasuya
హాట్‌ యాంకర్‌ అనసూయకు ఈ స్థాయిలో మంచి పాత్ర ఇచ్చి చరణ్‌ అండ్‌ సుకుమార్‌ పెద్ద షాక్‌ ఇచ్చారట. ఇంత మంచి పెద్ద పాత్ర దక్కినందుకు ముద్దుగుమ్మ అనసూయ చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో అనసూయ లిమిటెడ్‌ రోల్‌లోనే కనిపించింది. ఈ చిత్రంలో మాత్రం ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో కనిపించబోతుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: