సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ తన క్రేజ్ ను పెంచుకునే టెక్నిక్ సమంతకు తెలిసినట్లుగా మరి ఏహీరోయిన్ కు తెలియదు.  ఎప్పుడూ ఒకే రకమైన ఫోటోలు కాకుండా రకరకాల పోస్ట్ లతో  హడావిడి చేస్తూ సమంత అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఈ పరిస్థుతులలో ఈమె లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక  ఫోటో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈఫోటోకు సమంత ఒక వింత కామెంట్ కూడ పెట్టింది. 'ఓ ఆడదాని కళ్లలోకి చూసి ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడమే అసలైన అందం' అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరీ ఈఫోటోను షేర్ చేయడంతో సమంత కళ్ళ వెనుక ఉన్న బాధ గురించి రకరకాల ఊహాగానాలు అప్పుడే మొదలు అయిపోయా యి. 

నాగాచైతన్యను పెళ్ళిచేసుకుని మరి కొద్ది నెలల్లో అక్కినేని కుటుంబ కోడలుగా మారబోతున్న సమంతకు ఇప్పుడు ఏమి కష్టం వచ్చింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఈఫోటో సమంత లేటెస్ట్ గా నటిస్తున్న ‘రాజు గారి గది 2’ కు సంబంధించిన ఫోటో కాని లేదంటే చరణ్ తో లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాలోని ఫోటో అయి ఉంటుంది అన్న ఊహాగానాలు చేస్తున్నారు. 

ఇలా సమంత వదిలిన క్విజ్ తో ఆమె అభిమానులు రకరకాల కోణాలలో సమంత కళ్ళను ఆ కళ్ళ వెనుక ఉన్న బాధను విశ్లేషిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. సమంత లేటెస్ట్ ఫోటో చెప్పే కథలు రకరకాలుగా అభిమానుల ఊహలకు పదును పెడుతున్న న్పధ్యంలో ఈరోజు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా సమంత లేటెస్ట్ ఫోటో మారిపోయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: