బ‌లుపు పాట‌ల‌తోనూ. డీ-డే పోస్ట‌ర్ల‌తోనూ అంద‌రికీ జ్వ‌రాలు వ‌చ్చేలా చేసింది శ్రుతిహాస‌న్‌. ఇప్పుడు ఈ అమ్మ‌డికి నిజంగానే జ్వ‌రం వ‌చ్చింద‌ట‌. అల్లు అర్జున్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా రేసుగుర్రం అనే సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం స్విర్జ‌ర్లాండ్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. అక్క‌డ ఫ్లైట్ దిగ‌గానే - శ్రుతికి తేడా చేసింద‌ట‌.

ఫుల్ ఫీవ‌ర్ వ‌చ్చేసిందట‌. అయినా స‌రే, ఆ ఫీవ‌ర్‌తోనే షూటింగ్‌లో పాల్గొని త‌న డెడికేష‌న్ చూపించింది. ఫుల్ ఫీవ‌ర్‌లోనూ.. షూటింగ్‌లో పాల్గొన‌డం శ్రుతికి ఇదేం కొత్త కాదు. డీడే స‌మయంలో ఓ పాట‌ని జ్వ‌రంలోనే పాడేసి, శెభాష్ అనిపించుకొంది శ్రుతి. ఇప్పుడు రేసుగుర్రంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది.

��

``ఇందులో విడ్డూరం ఏముంది?  వృత్తి మీద గౌర‌వం ఉన్న‌వాళ్లెవ‌రైనా అదే ప‌నిచేస్తారు. నావ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం అవకూడ‌దు. ఎవ‌రికీ న‌ష్టం జ‌ర‌క్కూడ‌దు. అది నాన్న ద‌గ్గ‌ర నేర్చుకొన్న విష‌య‌మే. ఇప్పుడు అదే చేశా`` అంటోంది. శ్రుతి హార్డ్ వ‌ర్క్‌కి మాత్రం రేసుగుర్రం టీమ్ అంతా స‌లామ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: