హీరోయిన్లపై కాస్త ఓవర్ గా మాట్లాడటం కమేడియన్ ఆలీకి అలవాటే.. ఆయన గతంలోనూ చాలామంది హీరోయిన్లపై జోవియల్ గా కామెంట్లు చేసి విమర్శల పాలయ్యాడు. ఈసారి ఆరేంజ్ లో కాకపోయినా మరోసారి టాప్ హీరోయిన్ పై కామెంట్లు విసిరాడు. రాఘవేంద్రరావు దర్శక జీవితంపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన అలీ పలువురు హీరోయిన్లపై కామెంట్లు చేశారు. 

Image result for comedian ali COMMENTS
మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీసేందుకు వస్తే హీరోయిన్ గా ఎవరిని ఎన్నుకుంటారు.. సమంతా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్.. ఇంకా ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎవరిని ఎంచుకుంటారు అని యాంకర్ సుమ అని అడిగిన ప్రశ్నకు అలీ టక్కున సమంత అని సమాధానం చెప్పేశాడు.. ఎందుకు సమంతనే ప్రిఫర్ చేస్తున్నారు అని సుమ అడిగితే సమంత అయితే సమ్మగా ఉంటుందని కామెడీ చేశారు ఆలీ. 


            తీరు మారదా.. అలీ మరోసారి బూతు..!
ఆ తర్వాత తాను చేసిన కామెంట్ మరీ ఘాటుగా ఉందని ఆయనే ఫీలయ్యాడో ఏమో.. సమంత బాగా నటిస్తుందని.. శ్రీదేవిని కాస్త దిగ్గొట్టి పొట్టిగా చేస్తే సమంత అవుతుందని పొగిడేశాడు.. మనకు  ఈ రకుల్, కాజల్ వంటి వారు సరిపోరని సైటైర్లు వేశాడు. మరి ఆలీ కామెంట్లకు సదరు హీరోయిన్లు ఎలా ఫీలవుతారో... ఏమని కామెంట్ చేస్తారో చూడాలి. ఏమైనా ఆలీ కాస్త నోరు సంభాలించుకుంటే మంచిదేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: