తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. విమర్శకుల చే ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్ బాహుబలి 2 రాబోతుంది.  ఈ చిత్రం గురించి యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది.  ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై కన్నడీలు గుర్రుమీద ఉన్నారు.  
Image result for baahubali 2 kattappa
బాహుబలి ది కన్ క్లూజన్ మూవీని కర్ణాటకలో విడుదల చెయ్యనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఈ నెల 28 న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో కన్నడ ఒకోటా సంస్థ బెంగుళూరు బంద్ కు పిలుపునిచ్చింది.  దీనికి కారణం గతంలో సత్యరాజ్ (కట్టప్ప) చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఒకోటా అధ్యక్షుడు వతల్ నాగరాజ్ అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి తాము వ్యతిరేకులం కాదని కాకపోతే కావేరీ జలాల వివాదంలో సత్యరాజ్ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వారి ఆరోపణ.
Image result for baahubali 2
సత్యరాజ్ క్షమాపణ చెబితే తమ నిర్ణయాన్ని తిరిగి పరిశీలిస్తామని నాగరాజ్ అన్నారు. గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అ తరువాత అయన తన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవడంతో అయన చిత్రం శివాజీ విడుదలకు ఈ సంఘాలు అనుమతించాయి. మరి మన కట్టప్ప కన్నడీలకు సారీ చెబుతారా లేదా అనే విషయం త్వరలో తెలియాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు రాజమౌళి సినిమా విడుదలకు అభ్యంతరం పెట్టవద్దన వారిని కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: