తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు.  అయితే ఏవరికి వారే తమ టాలెంట్ చూపిస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.  పవన్ కళ్యాన్, అల్లు అర్జున్,రాంచరణ్ ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగా ఈ మద్య వచ్చిన కొత్త హీరోలు సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ్ లు కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంటున్నారు.  అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు డ్యాన్స్, యాక్షన్ పరంగా తమదైన వెరైటీ చూపించడం కామన్..ప్రస్తుం వస్తున్న హీరోలు ఆ విషయంలో ఏమాత్రం తేడా లేకుండా తమ టాలెంటూ ప్రూఫ్ చేసుకుంటున్నారు.  
Image result for mohan lal 1971 allu shirish
అయితే అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ మాత్రం కాస్త విటికి భిన్నంగా ఉన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది.  ‘గౌరవం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ తర్వాత వచ్చిన ‘కొత్తజంట’ చిత్రం కాస్త పరవాలేదు అనిపించింది.  తర్వాత మనోడు చాలా గ్యాప్ తీసుకొని ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో నటించాడు.  ఈ చిత్రం ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ గా మంచి విజయం సాధించినా శిరీష్ కి మాత్రం పేరు తీసుకు రాలేక పోయింది.  
Image result for allu sirish allu arjun
అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా మళియాళంలో కూడా మంచి పేరు ఉంది. దీంతో అన్నయ్యకు ఉన్న ఇమేజ్ క్యాష్ చేసుకోవాలని మనోడు మళియాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 1971 చిత్రంలో కీలక పాత్రలో పోషించాడు.  కానీ అక్కడ కూడా బ్యాడ్ లక్ వెంటాడంతో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.  దీంతో తెలుగు లో కాకుండా మళియాళంలో రాణిస్తాడనుకున్న ఆశలు ఆవిరైపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: