తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మళియాళ భామ సమంత తర్వాత అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు దాటినా సమంత మాత్రం ఇప్పటికీ గ్లామర్ హీరోయిన్ గా బిజీ బిజీగా ఉంటుంది.  ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ ఎన్నో విభిన్నమైన పాత్రలు వేసిన సమంత ఇప్పటి వరకు హర్రర్ తరహా చిత్రాల్లో నటించలేదు..అందులోనూ దెయ్యం పాత్రలో అసలే కనిపించలేదు.  ఇక బుల్లితెరపై ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఓంకార్ తర్వాత డైరెక్టర్ గా మారి జినియస్ సినిమా తీశారు.  
Image result for rajugari gadhi 2 stills
కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాలేదు. తర్వాత హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో ‘రాజుగారి గది’ చిన్న సినిమాగా విడుదల అయ్యి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ‘రాజుగారి గది 2’ తెరకెక్కుతోంది.  ఈ చిత్రంలో కింగ్ నాగార్జున్ ఓ సైక్రియార్టిస్ట్ గా నటించబోతున్నారు.  అయితే ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో సమంత నటిస్తుంది. సినిమాలో వీరిద్దరి పాత్రలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో  సమంత ఒక ఆత్మ పాత్రలో నటిస్తోందట.
Image result for rajugari gadhi 2 stills
ఆ పాత్ర సినిమాకు చాలా ముఖ్యమైనదని, కథ మొత్తం ఆమె ఆ ఆత్మ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. అలాగే నాగార్జునకు, సమంత కు మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.  ఇప్పటికే సమంత,నాగ్ కాంబినేషన్ లో మనం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శీరత్ కపూర్ అక్కినేని నాగార్జున కు జోడీగా నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: