ఏప్రిల్ 28 విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న టైం లో బాహుబలి 2 మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా లో మొదటి భాగం కి మించిన వీఎఫ్ఎక్స్ ఉండబోతున్నాయి అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. మొదటి బాహుబలి లో జలపాత దృశ్యం అతిపెద్ద వింత , విశేషం . సినిమా కథ మొత్తం నడిచేది అక్కడే. యుద్ధ సన్నివేశాలూ, మంచు కొండలూ రాక ముందర వరకూ ఈ జలపాతమే కథ ని నడిపిస్తుంది.


పార్ట్ 2 లో అంతకంటే ఎక్కువగా మలుపులు, వింతలూ ఉంటాయి అంటున్నారు vfx నిపుణులు కమల్ కన్నన్. పార్ట్ 2 లో నీళ్ళకి సంబంధించి ఒక సూపర్ ఎపిసోడ్ ఉందట అది సూపర్ డూపర్ విజువల్ వండర్ గా నిలిచిపోతుంది అంటున్నారు ఆయన. పార్ట్ 1 లో యుద్ధ సన్నివేశాల కోసం గ్రాఫిక్స్ ని విపరీతంగా వాడారు. పార్ట్ 2 లో ఒక పాట పూర్తిగా గ్రాఫిక్ లతో తీర్చి దిద్దరత మౌళి. 


బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 సినిమాల్లో ఏ స‌న్నివేశం కోసం ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డారంటే.. చెప్ప‌లేక‌పోతున్నాడీ మాయా మాంత్రికుడు. ప్రతీ సన్నివేశానికీ ఒకేలాగా కష్టపడ్డాం అనీ ఒకటి కంటే మరొకటి తక్కువ కాదు అనీ చెప్పుకొస్తున్నారు ఆయన. బాహుబలి సినిమా గురించి జీవితాంతం చెప్పుకునేలాగా రెండో పార్ట్ ని తీర్చి దిద్దేసాం అంటున్నారు. భళి భళి భళిరా భళి పాట న భూతో న భవిష్యత్తు గా ఉంటుంది అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: