సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. జూన్ 23న రిలీజ్ అనుకున్న ఈ సినిమా షూటింగ్ జూన్ 10దాకా జరిగే అవకాశాలు ఉండటంతో స్పైడర్ రిలీజ్ ను ఆగష్టుకి వాయిదా వేశారని అంటున్నారు. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని దాదాపు మహేష్ మూవీ జూన్ లో రావడం కష్టమే అని తెలుస్తుంది. 


ఇక ఈ సినిమా తర్వాత శ్రీమంతుడు డైరక్టర్ కొరటాల శివతో మరో సినిమా చేస్తున్నాడు మహేష్. భరత్ అనే నేను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే ముహుర్తం పెట్టేయగా మే 18 నుండి రెగ్యులర్ షూటింగ్ చేస్తారట. స్పైడర్ రిలీజ్ కు ముందే మహేష్ మరో సినిమా చేయడం చెప్పుకోదగ్గ విషయం. 


కొరటాల శివ మరో సోషల్ మెసేజ్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడట. సోషల్ మెసేజ్ ను కమర్షియల్ అంశాలతో చెబుతున్న కొరటాల శివ మహేష్ తో శ్రీమంతుడుని మించే హిట్ ఇస్తాడని అంటున్నారు.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బికిని భామ కియారా అద్వానిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. స్టార్ హీరోలు ఈమధ్య సినిమాల స్పీడ్ పెంచారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షురూ చేస్తున్నారు ఈ క్రమంలో మహేష్ స్పైడర్ ముగింపు దశలో ఉండగా కొరటాల సినిమా కోసం డేట్స్ ఇచ్చేశాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: