సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన భావాలను వ్యక్త పరచడంలో ఎటువంటి మొహమాటాలకు తావుఇవ్వకుండా అందరిపైనా సంచలనవ్యాఖ్యలు చేయడం ఆయన అలవాటు. ఈఅలవాటు వల్లే తమ్మారెడ్డి చేసే వ్యాఖ్యలు నిరంతరం హాట్ న్యూస్ గా మారుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటాయి. 

టాలీవుడ్ సినిమా రంగంలో చిన్నాపెద్దా లాంటి తారతమ్యాలు లేకుండా ఎవరి పైనైనా ఏటాపిక్ పై అయినా తన ఉద్దేశ్యాలను స్పష్టంగా వ్యక్తంచేయగల వ్యక్తిత్యం తమ్మారెడ్డి సొంతం. గతంలో తరుచు ప్రెస్ మీట్స్ లో సంచలన వ్యాఖ్యలు చేసే ఈదర్శక నిర్మాత ఈమధ్య తానూ స్వంతంగా ఓయూట్యూబ్ ఛానల్ ప్రారంభింఛి తాను చెప్పదలచుకున్న మాటలను అందరికీ తరచు చేరవేస్తూ తెగబిజీగా ఉంటున్నాడు. 

ఈపరిస్థితులలో ఈమధ్య తెలుగు సినిమారంగంలో పెరిగిపోతున్న వందకోట్ల రూపాయల బడ్జెట్ సినిమాల కల్చర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు భరద్వాజ. ఒక హీరో రెమ్యూనరేషన్ 20 నుంచి పాతిక కోట్లు. ఉంటె దర్శకుడికి కూడ దాదాపు అంతే ఉంటోంది అనిఅంటూ  హీరోయిన్లకు కూడా కలిపితే ఓ 50 కోట్లు అక్కడే అయిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇక భారీ హీరోల సినిమాలను కనీసం 200 రోజులు పైగా షూట్ చేస్తారు కాబట్టి రోజుకు 15 లక్షలు ఖర్చులు వేసుకున్నా మరో 20 కోట్లు ఖర్చు అవుతోంది అన్న షాకింగ్ నిజాలను బయటపెట్టాడు భరద్వాజ.

అయితే ఈడబ్బును అంతాబయట నుంచి తెస్తారు కాబట్టి వడ్డీలు కోసమే 15 కోట్లు ఖర్చు పెట్టాలవలసి వస్తోంది అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈటెన్సన్స్ మధ్య టాప్ హీరోలతో సినిమాలు తీసే నిర్మాతలకు సినిమాల క్వాలిటీ గురించి చూసుకునే తీరికఎక్కడ ఉంటుంది అంటూ నేటి టాప్ హీరోల సినిమా నిర్మాతల పరిస్తుతులను వివరించాడు తమ్మారెడ్డి. 

తమ్మారెడ్డి మాటలను విన్నవారికి ఆయన టార్గెట్ చేస్తున్నది ఏటాప్ హీరోలను అన్నవిషయమై క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహేష్ బాబు- మురుగదాస్ ‘స్పైడర్’ పవన్- త్రివిక్రమ్ కొత్త మూవీ  ప్రభాస్ - సుజిత్ ల ‘సాహో’ ఇలా టాప్ హీరోల సినిమాలను టార్గెట్ చేస్తూ తమ్మారెడ్డి కామెంట్స్ చేసి ఉంటాడు అన్నది ఓపెన్ సీక్రెట్. 100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాలను తీసే నిర్మాతలు ‘పెళ్లి చూపులు’ ‘శతమానం భవతి’ వంటి చిత్రాలను 40 తీయవచ్చని అంటున్న తమ్మారెడ్డి మాటలలోని అంతర్యాలను పట్టించుకునే తీరిక ప్రస్తుతం ఎవరికి ఉంది అన్నదే ప్రశ్న..   



మరింత సమాచారం తెలుసుకోండి: