క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా గురించి ఒక్కొక్క విషయం రివీల్ అవుతూ వస్తుంది. పల్లెటూరి కథతో రాబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.


రీసెంట్ గా షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన ఫోటోలు సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక అదే కాకుండా సినిమాలో చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అని తెలుస్తుంది. చిట్టిబాబుగా సాదాసీదాగా ఉంటూనే అద్భుతమైన క్యారక్టరైజేషన్ చూపిస్తాడట. సుకుమార్ ఎంతో ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గత జన్మల కాన్సెప్ట్ తో అద్భుతమైన ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హోప్స్ ఉన్నాయి. ఇక అదే కాకుండా ధ్రువ తర్వాత చరణ్ నుండి ఈ మూవీ రాబోతుంది.


సినిమా టైటిల్ గా రేపల్లె అని పెట్టే ఆలోచనలో ఉన్నారట. సుకుమార్ మాత్రం మొగళ్తూరు మొనగాడు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాడట. సినిమాలో ఊహించని ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయని ధ్రువ తర్వాత ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసేలా ఈ మూవీ ఉంటుందని చెబుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: