ప్రభాస్ అబిమానులు ‘బాహుబలి 2’  విడుదలకోసం అత్యంత ఆత్రంగా ఎదురు చూస్తుంటే మధ్యలో ప్రభాస్ లేటెస్ట్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ హడావిడి కూడ ప్రారంభం అయిపోయింది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది.

ఈ మూవీ టీజర్ ‘బాహుబలి 2’ థియేటర్స్ లో ఈ నెల 28 నుంచి ప్రదర్శింప పడబోతున్న నేపధ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఈలోపే విడుదలచేసి ప్రభాస్ అభిమానులకు జోష్ ను పెంచారు. అయితే ఈ ఫస్ట్ లుక్ డిజైనింగ్ లో ఇంగ్లీష్ అక్షరాలు వాడటం ఇప్పడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 

అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ‘సాహో’ అన్న తెలుగు పదాలను ఇంగ్లీష్ అక్షరాలతో రాసి వాటితో ప్రభాస్ ఫేస్ లుక్ ను డిజైన్ చేసారు. సామాన్యంగా ఒక మూవీ టైటిల్ ఇంగ్లీష్ లో ఉంటె ఇలా ఇంగ్లీష్ అక్షరాలను వాడతారు. 

అయితే అచ్చమైన తెలుగు టైటిల్ తో నిర్మింప బడుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇంగ్లీష్ అక్షరాలతో దర్శకుడు సుజిత్ డిజైన్ చేయడం వెనుక ఎదో కారణం ఉంది అన్న చర్చలు అప్పుడే మొదలైపోయాయి. ఈసినిమాలో ప్రభాస్ అంతర్జాతీయ సంస్థ గూడచారిగా కనిపిస్తాడు అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుజిత్ ఈవిధంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఇంగ్లీష్ అక్షరాలతో డిజైన్ చేసి ఉంటాడు అన్న సందేహాలు కూడ వ్యక్తమవుతున్నాయి.  ఏది ఏమైనా ‘బాహుబలి 2’ విడుదల కాకుండానే ‘సాహో’ హడావిడి కూడ ప్రారంభం అయి పోవడంతో ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ హడావిడి మాత్రమే కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: