ఈమధ్య కాలంలో సంగీత దర్శకులు చాలామంది స్టేజ్ షోల కోసం విదేశాలకు వెళ్ళుతున్నారు. ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ త్వరలో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ లో మ్యూజిక్ కాన్సెర్టులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.  ఈటూర్ కు సంబంధించిన వీడియో ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. 

ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్ పై ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా దేవీశ్రీప్రసాద్ కు ఒక ట్యాగ్ ఇచ్చాడు. ఈ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న ఈసమయంలో తనకు దేవీశ్రీప్రసాద్ ముఖం చూడగానే తనకు చాల ఆహ్లాదంగా అనిపించింది అని చెపుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

తనకు దేవిశ్రీని చూస్తే తమ ఇంటిలోని అబ్బాయిలా అనిపిస్తాడు అని చెపుతూచాలామంది అభిమానంతో పిలిచే డిఎస్పీ అంటే అతడి పేరు మాత్రమే కాదు అతడి తీరు అంటూ ఒక కొత్త భాష్యం చెప్పాడు.  డి అంటే డెడికేషన్ ఎస్ అంటే స్ట్రాటజీ పి అంటే పాపులారిటీ అంటూ డిఎస్పి పదంలోని అక్షరాల వెనుక అర్ధాలను వివరించాడు మెగా స్టార్.

ఎదుటి వారిని ఎలా ఆకట్టుకోవాలి వారి మన్నలను ఎలా పొందాలి అన్న సీక్రెట్ దేవిశ్రీకి తెలిసినంతగా మరి ఏ సంగీత దర్శకుడుకి తెలియదు అంటూ చిరంజీవి మరొక ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు దేవిశ్రీ  మ్యూజిషియన్ మాత్రమే కాదు మేజీషయన్ అంటూ చిరంజీవి దేవిశ్రీ ఫై కురిపించిన పొగడ్తల వర్షం ఈ కార్యక్రమానికి హాట్ న్యూస్ గా మారింది. 

ఇదే సమావేశంలో మాట్లాడిన చిరంజీవి వెస్ట్రన్ సైడ్ మైఖేల్ జాక్సన్ లాంటి రాక్ స్టార్లను చూసిన సందర్భాలు ఉన్నాయని అలాంటి క్రేజ్ ను దక్షిణాది సినిమా రంగంలో సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ ను చూస్తే తనకు గర్వంగా ఉంటుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు చిరంజీవి. ఈ కాన్సెర్టుల ద్వారా వచ్చే డబ్బులో కొంత సమాజ సేవకోసం ఉపయోగిస్తాను అని చెపుతున్న దేవిశ్రీప్రసాద్ రాబోయే రోజులలో చేయబోయే సామాజిక క్ర్ర్యక్రమాల గురించి అందరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: