సినిమా ఇండస్ట్రీ అంటే అదో రంగుల ప్రపంచం అని అనుకుంటారు చాలా మంది.  ఇక ఒక్కసారి వెండితరపై కానీ..బుల్లితెరపై కాని కనిపిస్తే చాలా తమ జీవితంలో ఎంతో ఆనందం పొందుతారు..అంతే కాదు మంచి గుర్తింపు వస్తే సెలబ్రెటీలు అవుతారు.  ఇలా వెండితెరపై, బుల్లితెరపై కనిపించాలని స్టూడియోల చుట్టూ తిరిగేవారిని రోజూ చూస్తునే ఉంటాం.  అయితే ఇలాంటి వారి బలహీనతలు కొంత మంది దుర్మార్గులు క్యాష్ చేసుకుంటారు.  ఇండస్ట్రీలో తమకు పెద్ద డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు తెలుసని అమ్మాయిలను బురిడీ కొట్టించి తమ లైంగిక వాంచ తీర్చుకున్న తర్వాత వారిని వెశ్యా గృహాలకు అమ్మిన సంఘటనలు కూడా ఉన్నాయి.  


ఇలా మోసపోయిన అమ్మాయిలు దుర్భరమైన జీవితం అనుభవిస్తూ ఉంటారు..కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంత మంది ఇండస్ట్రీకి చెందిన వారు కూడా అమ్మాయిలను, మోడల్స్ ని మోసం చేస్తూ తమ లైంగిక వాంచ తీర్చుకుంటారు.  అలా మోస పోయామని తెలుసుకున్నతర్వాత బోరుమంటారు యువతులు.


 తాజాగా బాలీవుడ్ కి చెందిన  టీవీ నటుడు పార్థ్ సంతాన్‌పై కేసు నమోదైంది. బంగూర్ నగర్‌లో నటుడు పార్థ్ సంతాన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మోడల్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ముంబై పోలీసులు పార్థ్ సంతాన్‌పై పోస్కో చట్టంలోని 8,12 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: