తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి.  బయటకు వెళ్లాలంటే ఒక్కక్కిరికీ ముచ్చెమటలు పడుతున్నాయి. ఉదయం తొమ్మిదిగంటల  నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతున్నాడు.  సామాన్యులకే కాదు ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా బాగానే ఉంది.  ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వారు ఈ ఎండలు భరించలేక షూటింగ్ వాయిదాలు వేస్తున్నట్లు తెలుస్తుంది.  మామూలుగా సినీ తారలనగానే చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటాం గానీ కొన్ని సార్లు వాళ్ళుకూడా తట్టుకోలేనంత భాదలని భరించాల్సిందే.  

Image may contain: 3 people, people standing

ఇక కెమెరా ముందుకు వస్తే ఎన్ని చికాకులు ఉన్న సరైన ఎక్స్ ప్రెషన్స్ పెట్టాలి లేదంటే విపరీతమైన టేకులు తీసుకుకోవాల్సి వస్తుంది.  తాజాగా తెలుగులో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారిపోయిన హీరోయిన్ రకూల్ ప్రిత్ సింగ్ .  తాజాగా ఈ అమ్మడు ఎండ వేడికి తట్టుకోలేక ఆ భాదలోనూ ఇదిగో ఇలా ఫోజిచ్చింది.. ఈ ఫోటోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన రకుల్‌.. 45 డిగ్రీల ఎండలో రేపల్లేలో షూటింగ్‌ చేస్తున్నట్టు చెప్పింది.

Image may contain: 1 person, close-up

అంతేకాకుండా 'విపరీతమైన వేడిలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇలా కప్పుకోవాల'ని సలహా కూడా ఇచ్చింది.  మొత్తానికి రాష్ట్రంలో ఎండలు చిన్న నుంచి పెద్ద వరకు..సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎండ భరించలేక నానా బాధలు పడుతున్నట్లు తెలుస్తుంది. 

రకూల్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: