సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్లుగా చెప్పుకోదగ్గవారిలో అమితాబచ్చన్, రజినీకాంత్,కమల్ హాసన్,చిరంజీవి,మోహన్ లాల్ ఇలా జాతీయ స్థాయిలో గుర్తించ బడ్డ నటులు.  మళియాళ సూపర్ స్టార్ గా మోహన్ లాల్ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. ఎప్పుడో నాగేశ్వరరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘గాంఢీవం’ చిత్రంలో ఓ పాటలో కనిపించిన మోహన్ లాల్ గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్ ’ చిత్రంలో నటించారు.
Image result for mohan lal bhema
ఎన్టీఆర్, మోహన్ లాల్ పోటీ పడి నటించిన ఈ చిత్రం రెండు భాషల్లో ఘన విజయం సాధించింది.  తాజాగా మోహన్ లాల్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచనల కామెంట్ చేశారు..అయితే అది పాజిటీవ్ గానే సుమా.   మోహన్ లాల్ ఓ లెజెండరీ నటుడు , అంతటి గొప్ప వ్యక్తి మాత్రమే భీముడి గా నటించడానికి అర్హతలు ఉన్నవాడు అంతేకాని నా లాంటి వాడు కాదని చెప్పి సంచలనం సృష్టించాడు ప్రభాస్ .
Image result for janatha garage
బాహుబలి 2 ప్రమోషన్ కోసం ఇటీవల కేరళ వెళ్ళాడు.  రీసెంట్ గా ఓ ప్రముఖ వ్యాపార వేత్త ‘మహాభారతం’ సినిమాను వెయ్యి కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నారని అందులో భీముడిగా మోహన్ లాల్ నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి.  దీనిపై బాలీవుడ్ క్రిటిక్ ,వివాదాస్పద హిందీ నటుడు కమల్ ఆర్ ఖాన్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు.  మహాభారతంలో భీడిగా మోహన్ లాల్ కన్నా ప్రభాస్ బాగుంటాడని అన్నారు.
Image result for baahubali 2
ఇక మలయాళ మీడియా ప్రభాస్ ముందు కమాల్ ఆర్ ఖాన్ చేసిన విమర్శల గురించి స్పందించాలని కోరగా పై విధంగా స్పందించి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు ప్రభాస్ . వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహాభారతం లో మోహన్ లాల్ భీముడి పాత్ర పోషించడానికి అంగీకరించాడు . ఆ నేపథ్యంలో ఈ విమర్శలు వచ్చాయి అయితే ప్రభాస్ స్పందించిన తీరు కి అక్కడి మీడియా ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతోంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: