ఆ మధ్యన ఒక పోల్ నిర్వహించి అందులో జనం ఎదురు చూస్తున్న అతి ఇంపార్టెంట్ సినిమా ఏది అంటూ ఆప్షన్స్ పెడితే బాహుబలి రెండో భాగానికి మొదట ప్లేస్ వచ్చేసింది. మొదటి భాగం సృష్టించిన ప్రశ్నల కి సమాధానం గా జనాల్లో రెండో భాగం మీద ఆసక్తి పెరిగిన సంగతి వాస్తవం. కానీ ఆన్ లైన్ జనాలని పక్కన పెట్టి సాధారణ ప్రేక్షకులని పరిగణ లోకి తీసుకుంటే నెమ్మదిగా హైప్ తగ్గుతోంది అంటున్నారు. జనాల్లో ఈ సినిమా మీద ఆసక్తి తగ్గడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు.


బాహుబలి మొదటి భాగం రాక ముందర బాలీవుడ్ జనానికి ఈ సినిమా గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు అందరికీ సినిమా విశేషాల గురించి తెలుస్తున్నాయి కాబట్టి ఓపిక పడుతున్నారు. ప్రమోషన్ విషయం లో కూడా టీం రెండో భాగం లో చాలా స్లో గా లైట్ గా వెళుతున్నారు.  బాహుబలి1 కోసం బోలెడంత వర్క్ చేశారు.


రెండు నెలల ముందు నుంచి మొదలు పెట్టి.. ఒక్కో కేరక్టర్ కు లుక్స్.. చిన్న పాటి టీజర్ చొప్పున విడుదల చేస్తూ అంతంకంతకూ ఆసక్తిని రెట్టింపు చేస్తూ వచ్చారు. ట్రైలర్ వచ్చినప్పుడు బాహుబలి 2 కి  హైప్ కనపడింది కానీ ఇప్పుడు కాస్త నీరసంగానే ఉంది అంటున్నారు. పబ్లిసిటీ యాక్టివిటీస్ లో ఒకప్పటి లాగా క్రియేటివిటీ మౌళి వాడడం లేదు. అనుకున్న స్థాయి లో ఓపెనింగ్ లు వస్తాయా లేదా అనేది తెగ డిస్కషన్ జరుగుతోంది


మరింత సమాచారం తెలుసుకోండి: