మహేష్ సినిమా ‘స్పైడర్’ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఈ మూవీ క్లైమాక్స్ ను తిరిగి రీ రైట్ చేస్తున్న దర్శకుడు మురగదాస్ కు ఈ సినిమాను ఎలా ముగించాలి అన్న విషయమై రకరకాల అయోమాయాలు వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మురగదాస్ మొదట అనుకున్న ముగింపు తమిళ ప్రేక్షకులకు నచ్చుతుంది కాని తెలుగు ప్రేక్షకులకు నచ్చదు  అన్న అనుమానాలు ఏర్పడటంతో అటు తెలుగు ప్రేక్షకులకు ఇటు తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఒక పవర్ ఫుల్ క్లైమాక్స్ కోసం మురగాస్ ప్రయత్నిస్తూ ఉన్నా సరైన క్లైమాక్స్ ఆలోచనలు మురగదాస్ కు రాలేదు అన్న గాసిప్పులు హడావిడి  చేస్తున్నాయి. 

ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆగష్టు 15న  కూడా రావడం కొంచం కష్టం అంటున్నారు.  మహేష్ అభిమానులను ‘బ్రహ్మోత్సవం’ పూర్తిగా నిరాశపరిచిన నేపధ్యంలో మురగదాస్ మహేష్ లు ఈసినిమా విషయంలో తీసుకుంటున్న  అతి జాగ్రత్తలు అసలుకు మోసం వస్తుందా ? అన్న అనుమానంలో మహేష్ అభిమానులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు మురుగదాస్ తెలుగులో తీసిన డైరక్టు సినిమా ‘స్టాలిన్’ అంతగా ఆకట్టుకోలేదు. డైరెక్టర్ ఎస్.జె. సూర్య తీసిన ‘నాని’ ‘కొమరం పులి’ రెండు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సెంటి మెంట్స్ తో పాటు ఇప్పుడు నటుడిగా మారిపోయి సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించడం కూడ మహేష్ అభిమానులను భయపెడుతోంది అని టాక్.

దీనికితోడు మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ నెగిటివ్ సెంటిమెంట్ కూడ ఈసినిమాను వెంటాడుతోంది. దీనితో అనేక భయాల మధ్య ఈ భారీ మూవీ కోసం చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈసినిమా యూనిట్ వర్గాలు మాత్రం ఈమూవీలోని VFX క్వాలిటి కోసం మురగదాస్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న నేపధ్యంలో ఈ ఆలస్యం జరుగుతోంది కానీ ఈసినిమాకు సంబంధించి క్లామాక్స్ అయోమయం కాదు అని అంటున్నట్లు టాక్. ఇలా రకరకాల హాట్ గాసిప్పుల మధ్య నడుస్తున్న ‘స్పైడర్’ వ్యవహారం ఇంకా రానున్న రోజులలో ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందో అన్న భయంలో మహేష్ అభిమానులు ‘స్పైడర్’ రాక కోసం అత్యంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: