దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి2 చిత్రంను యావత్ ఇండియా చూడటానికి ఆసక్తి చూపుతుంది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రల్లో ఈ క్రేజ్ మరింత ఎక్కువుగా ఉంది. అలాగే సౌత్ ఇండియాలోనూ బాహుబలి2 పై క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. సినీ ప్రేక్షకులు బాహుబలి2ని ఆధరిస్తుంటే ఇంకా బాలీవుడ్ మాత్రం బాహుబలి2ని గుర్తించలేకపోతుంది.

బాలీవుడ్ లోని పలువురు స్టార్స్ ఈ మూవీపై ప్రస్థావించటానికి ఏ మాత్రం ఇష్టం చూపటం లేదు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్ఛన్, అలాగే ప్రముఖ డైరెక్టర్స్ అంతా బాహుబలి2 మూవీపై పెద్దగా ఆసక్తి చూపనట్టే బిహేవ్ చేస్తున్నారు. దీనికి కారణం ఇది హిందీ చిత్రం కాకపోవటమే. కానీ బాహుబలి2 కి సినీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉండటం కారణంగా ఈ మూవీకి విశేష ఆధరణ దక్కుతుంది. దీంతో ఇది ఇండియన్ సినిమాగా ఎదుగుతుంది.

బాహుబలి2 విజయం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే చెప్పుకోదగిన మైలురాయి చిత్రంగా నిలవనుందని అంటున్నారు. ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలు ప్రొడక్షన్ కంపెనీలు బాహుబలి2 విజయం ఏ రేంజ్ లో ఉంటుందొ ఆసక్తిగా గమనిస్తున్నాయి. హాలీవుడ్ మార్కెట్ కి దగ్గట్టుగా ఈ మూవీ విజయం సాధించిందంటే రాజమౌళి తో హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు సినిమాకి రెడీ అనే సంకేతాలు సైతం మార్కెట్ లో వినిపిస్తున్నాయి.

అయితే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం ఇంకా బాహుబలి విజయాన్ని జీర్ణించుకోలేక…దీన్నీ ఓ మూవీలా గుర్తించటం లేదు. బాలీవుడ్ వేధికలపై బాహుబలి ప్రస్థావన రాకుండా వీరు జాగ్రత్త పడుతున్నారు. అలాగే బిటౌన్ మీడియాలోనూ బాహుబలి ప్రస్తావన రాకుండా కొందరు బాలీవుడ్ పెద్ద జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా బాలీవుడ్ వెర్సెస్ బహుబలి అన్నట్టుగా ప్రస్తుతం బిటౌన్ లో కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: