రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి2 చిత్రం ఇప్పుడు ఓ సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ సాధిస్తున్న ఘనమైన రికార్డ్ అని అంటున్నారు. అయితే మనం మాత్రం ఈ సెలబ్రేషన్స్ ని ఓ తెలుగు చిత్రం సాధిస్తున్న అత్యంత ఘనమైన రికార్డ్ అని చెప్పకుంటేనే మంచిది. మన చిత్రం, మన తెలుగు చిత్రం…బాహుబలి అని ప్రతి తెలుగు వారు చెప్పుకోవాలి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బయట మార్కెట్ లో ఒక్క తమిళ చిత్రాలకే విలువ ఉంటుంది.


కానీ సౌత్ లో వస్తున్న తెలుగు చిత్రం బాహుబలి2 అంటేనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే బాహుబలి2 మూవీ ఏప్రిల్ 28న ప్రంపచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కంటే ముందుగానే ఓ అరుదైన రికార్డ్ ని క్రియోట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రాంతంలో బాహుబలి2 అడ్వాన్స్ బుకింగ్‌పై అద్భుతమైన స్పందన వస్తుంది.


బాహుబలి2 కన్‌క్లూజన్ చిత్రంను అందరికంటే ముందుగానే చూసేందుకు ప్రేక్షకులు ఏంతగానో పోటీ పడుతున్నారని ఈ అడ్వాన్స్ బుకింగ్ వల్ల తెలుస్తుంది. బాహుబలి2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఏప్రిల్ 22 నుండి ప్రారంభమైంది. ఇప్పటి వరకూ వారం రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. తెలుగు చిత్రాలలో ఏ చిత్రానికి ఇంతటి క్రేజ్ ఏర్పడలేదు. అలాగే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇదే మొదటి సినిమాగా పేరు సంపాదించుకుంది.


రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం కంటే బాహుబలి2చిత్రం అడ్వాన్స్ బుకింగ్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. తమిళనాడులో ఎస్పీఐ సినిమాస్ చెన్నైలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్. ఈ మల్టీప్లెక్స్ లో అయిదు రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ జరిగాయని అంటున్నారు. చెన్నైలో ఉన్న క్రేజ్ ని చూస్తుంటే బాహుబలి2 కి విశేష ఆధరణ ఉందని స్పష్టం అవుతుంది. అలాగే నార్త్ ఇండియాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో బాహుబలి2 అత్యధిక రోజులు బుకింగ్ జరిగి...ఇండస్ట్రీలోనే మొదటి స్థానంలో నిలబడింది. ఇది చాలా అరుదైన రికార్డ్ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: