‘బాహుబలి 2’ టిక్కెట్ల మ్యానియా తారా స్థాయికి చేరిపోవడంతో ఈ సినిమా టిక్కెట్ల గురించి జనం పడుతున్న పాట్లు పై ఛానల్స్ రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈసినిమా విడుదల సందర్భంగా పోలీసులు కూడా అఫిషియల్ గా సెలవులు పెట్టుకుంటున్న వార్తలు ఒకవైపు మరొక వైపు వరకట్నంగా పది లక్షల నగదు, పదిహేను తులాల బంగారం మరియు 20 ‘బాహుబలి 2’ టికెట్లను ఫైనల్ చేసాం అన్న జోక్స్ కూడ ఈరోజు పత్రికలలో చానల్స్ లో సందడి చేస్తున్నాయి అంటే ‘బాహుబలి 2’ మ్యానియా ఏ స్థితికి చేరిపోయిందో అర్ధం అవుతుంది. 

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 6 షోలు తెలంగాణలో 5 షోలు ఈసినిమాకు విడుదల రోజు నుండి వేస్తూ ఉన్నా మల్టీ ఫ్లక్స్ ల నుండి సాధారణ ధియేటర్ల వరకు ఈసినిమా టిక్కెట్స్ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.  ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ‘బాహుబలి2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోయే ధియేటర్ల సంఖ్య పెరిగిపోయి 9000 వేల థియేటర్ల స్థాయికి చేరుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 

ఒక్క అమెరికాలోనే ఈమూవీ 1100 థియేటర్లలో రిలీజ్ కానున్నది. మిగితా దేశాల్లో మొత్తం 1400 థియేటర్లలో ప్రదర్శించే చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ క్రేజ్ ను చూసిన  ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ‘బాహుబలి 2’ 1000 కోట్ల కలక్షన్స్ వసూలు చేయడం ఖాయం అని అంటున్నారు. 

ఇది చాలదు అన్నట్లుగా ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిన మూడో చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది. అమెరికాలో 40 ఐమాక్స్ స్క్రీన్లలో ఈసినిమా విడుదల అవుతూ ఉండటం అత్యంత సంచలనంగా మారింది. ఈమూవీ ఒక్క కేరళలోనే తొలిరోజు 5 కోట్లు వసూలు చేస్తుంది అని వార్తలు రావడంతో ‘బాహుబలి 2’ మొదటి రోజు కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్న అంచనాలు ఎవరి ఊహలకు దరిదాపులో లేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: