ప్రపంచంలో ఉన్న తెలుగు సిని ప్రియులంతా ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 గురించి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దాని నుండి బాహుబలి గురించి తెలియని విషయాలన్ని తెలుసుకోవాలని ప్రేక్షకులు ఉత్సాహ పడుతున్నారు. ఇక బాహుబలి-2 గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఓసారి చూసేద్దాం.     


రాజమౌళి ఈ సినిమా 60 శాతం సినిమా షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో షూట్ చేశాడు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన మొదటి పార్ట్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ పార్ట్ ఉండబోతుంది.


బాహుబలి మొదటి పార్ట్ ఊహించని క్లైమాక్స్ పెట్టిన జక్కన్న బాహుబలి-2 క్లైమాక్స్ భారీగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ క్లైమాక్స్ ఫైట్ కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చుపెట్టారట. 


బాహుబలి అనగానే వార్ సీన్స్ గుర్తుకు రావడం ఖాయం.. ఇక బాహుబలి 2 సినిమా కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్ జాన్ గ్రిఫిత్ వార్ సీన్స్ కంపోజ్ చేశారట. 


సినిమా ఈ రేంజ్ అంచనాలను రాబట్టడంలో ముఖ్య పాత్ర పోషించింది బాహుబలి-2 ట్రైలర్. దీని కోసం  25వ వర్షన్స్ కట్ చేసి చివరగా 25వ వర్షన్ ను ఫైనల్ చేశాడు రాజమౌళి.   


బాహుబలి 1,2 మాత్రమే కాదు బాహుబలి 3 కూడా ఉండే అవకాశాలుంటాయని రాజమౌళి ఎనౌన్స్ చేశాడు. సినిమాలో వార్ సీక్వెన్స్ కోసమే ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని చిత్రయూనిట్ కూడా చెప్పారు. సినిమాలో అద్భుతంగా సిజి వర్క్ చేయబడింది. తెర మీద అందరు వండర్స్ చూసేందుకు సిద్ధం కండి అని రాజమౌళి అండ్ కో కాన్ఫిడెంట్ గా చెబుతుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: