దర్శకధీరుడు రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. కేవలం బాహుబలి అన్న సినిమా కోసం ఐదేళ్లు తన కెరియర్ ను ఫణంగా పెట్టిన ప్రభాస్ ఇప్పుడు అందుకుంటున్న అభిమానానికి అర్హుడని చెప్పొచ్చు. బాహుబలి సినిమాకు సైనికులుగా ముందునుండి ఉంది నడిపించింది రాజమౌళి, ప్రభాస్.


తన కోసం ఇంత రిస్క్ తీసుకున్న ప్రభాస్ కు అమరేంద్ర బాహుబలి ధరించిన విలువైన కవచాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడట రాజమౌళి. అదే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాహుబలి కోసం తన వెన్నంటే ఉండి ఇంతకాలం ప్రయాణించిన ప్రభాస్ గురించి రాజమౌళి తన అభిమానాన్ని పంచుకున్నారు. 


చత్రపతితో ఏర్పడ్డ వీరి బంధం ఈనాడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పేలా బాహుబలిగా తయారయ్యింది. మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన రాజమౌళి కచ్చితంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించడం ఖాయమని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.  


ప్రభాస్ రాజమౌళి ల రిలేషన్ చూస్తే దర్శక నిర్మాతలకే కాదు మిగతా హీరోలకు జలస్ ఫీలింగ్ రాక తప్పదు. ఇద్దరు అంత కలిసిపోయారు కాబట్టే సినిమా అంత గొప్పగా వచ్చింది. బాహుబలి కోసం ప్రభాస్ తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అంతకంత క్రేజ్ ను నేషనల్ వైడ్ గా సంపాదించుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: