‘గీతాంజలి’ సినిమాలో దెయ్యం పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన అంజలికి నిజంగానే దెయ్యం భయం పట్టుకోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఈ రోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం అంజలికి ఏవో అతీత శక్తులతో సమస్యలు ఏర్పడినట్లుగా ఒక ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. 

మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలికి ఆమధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఏర్పడటంతో ఆమె కొన్ని వివాదాలలో చిక్కుకుంది. ఆతరువాత ఆ వివాదాలు ఒక కొలిక్కి వచ్చినా ఆమెకు టాప్ యంగ్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలు దక్కలేదు. 

దీనితో ఆమె తన రూట్ మార్చి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లోను ముఖ్యంగా హారర్ ఫిలిమ్స్ లో బాగా నటిస్తోంది. ఇప్పుడు ఆసినిమా కథల ప్రభావం ఆమెకు రియల్ లైఫ్ పై చూపెట్టడం ప్రస్తుతం షాకింగ్ న్యూస్ గా మారింది. హైద్రాబాద్ లోని గచ్చిబౌలిలోని తన అపార్ట్ మెంట్ లో ఉంటున్న అంజలిని ఏవో అతీత శక్తులు తనను వెంటాతుడుతున్నాయని అంజలి చాల భయపడుతోంది అని టాక్. 

ఆ భయంతోనే ఆమె ఇప్పటికే ఆమె ప్లాట్ ను ఖాళీ చేసి వేరేచోటుకు వెళ్లిపోయింది అని తెలుస్తోంది. అయితే ఇలాంటి ఆశ్చర్యకర నిర్ణయం ఆమె తీసుకోవడం వెనుక ఒక షాకింగ్ కారణం ఉంది.  రాత్రి పూట ఆమె ఇంటి చుట్టూ విపరీతంగా పిల్లులు తిరగడం, అర్ధరాత్రి పూట విచిత్రమైన శబ్దాలు రావడం వంటివి కొన్ని నెలలుగా జరుగుతు ఉండటంతో అంజలి భయపడిపోయి ఆ ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయింది అని ఆ ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని వ్రాసింది. 

ఆశ్చర్యం ఏమిటంటే ఈమె ఫ్లాట్ పక్కన అక్కినేని నాగచైతన్య ఫ్లాట్ కూడ ఉంది. అయితే నాగచైతన్యకు ఎటువంటి సమస్యలు ఏర్పడకపోయినా అంజలికి మాత్రం ఈ అతీంద్ర శక్తుల భయం ఏర్పడటం ప్రస్తుతం మీడియాకు హాట్ న్యూస్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: